Dimple Hayathi : బాలయ్యనే రిజక్ట్ చేసిన హాట్ బ్యూటీ..?

ఇండస్ట్రీలో హీరోయిన్ గా అవకాశాలు రావాలంటే చాలా కష్టం.
పెద్ద బ్యాగ్రౌండ్ అయినా ఉండాలి. లేదా ఇతర రాష్ట్రం వారైనా ఉండాలి. టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ హీరోయిన్స్ అందరూ నాన్-తెలుగు వారే. తెలుగు హీరోయిన్స్ ఉన్నా, చిన్న సినిమాలకే పరిమితం అవుతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో తెలుగు వారు.. ఈషా రెబ్బ, శివాని రాజశేఖర్, శివాత్మక రాజశేఖర్ తో పాటు డింపుల్ హాయతి ఉన్నారు. ఇందుల్లో ఈషా రెబ్బ కెరీర్ ప్రారంభంలో మంచి ఛాన్స్ లు వచ్చినా, ప్రస్తుతం స్పీడ్ తగ్గింది.

డింపుల్ హాయతి “గల్ఫ్” సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైనా, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ “గద్దల కొండ గణేష్” సినిమాలో “జర్ర జర్ర అచ్చ.. జర్ర జర్ర కచ్చా..” స్పెషల్ సాంగ్ తో గుర్తింపు తెచ్చుకుంది. అలాగే మాస్ మహారాజ రవితేజకు జోడీగా “ఖిలాడీ” సినిమాలోనూ నటించింది. ప్రస్తుతం శ్రీవాసు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తుంది.

అయితే డింపుల్ హాయతికి నందమూరి బాలయ్య బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు గత రెండు రోజులగా వార్తలు వస్తున్నాయి. గోపిచంద్ మలినేనితో చేస్తున్న మూవీలో ఓ స్పెషల్ సాంగ్ కోసం, డింపుల్ పేరును బాలయ్య సూచించాడట. అయితే బాాలయ్యకు షాక్ ఇస్తూ, డింపుల్ హయతి ఈ ఆఫర్ ను రిజక్ట్ చేసిందట.

- Advertisement -

తాను ఇక స్పెషల్ సాంగ్ లో నటించబోనని స్పష్టం చేసినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. దీంతో బాలయ్యనే రిజక్ట్ చేసిన ఈ భామ, ఎంత బిజీగా ఉందో, ఎన్ని సినిమాలు చేస్తుందో అని సినీ లవర్స్ అనుకుంటున్నారు. ఇదిలా ఉండగా, బాలయ్య సినిమాలకు హీరోయిన్ సమస్య ఎప్పటి నుండో ఉన్న విషయం తెలిసిందే. ఆయన సినిమాల్లో హీరోయిన్స్ నటించడానికి భయపడుతుంటారు. కానీ ఇప్పుడు బాలయ్యకు హీరోయిన్స్ తో పాటు ఐటెం సాంగ్స్ సమస్య కూడా పట్టుకుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు