విక్టరీ వెంకటేశ్– మె గా ప్రిన్స్ వరుణ్ తేజ్ మల్టీ స్టారర్ గా ఎఫ్ 3 మూవీ వస్తున్న విషయం తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో మిల్క్ బ్యూటీ తమన్నా, మెహ్రీన్ హీరోయన్స్ గా నటిస్తున్నారు. కీలక పాత్రలో రాజేంద్ర ప్రసాద్, సునీల్, వెన్నెల కిషోర్ కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుండి “ల్యాబ్ దబ్ ల్యాబ్ డబ్ డబ్బూ.., ఊ..ఆ..హ..హా సాంగ్స్ తో పాటు ట్రైలర్ రిలీజ్ అయ్యాయి.
తాజా గా ఈ మూవీ నుండి స్పెషల్ సాంగ్ రిలీజ్ అయింది. బుట్ట బొమ్మ పూజ హెగ్డే నటించిన ఈ సాంగ్ లో అందాల డోస్ కాస్త ఎక్కువగానే ఉంది. ‘లైఫ్ అంటే మినిమమ్ ఇట్టా ఉండాలా .. ‘ అంటూ సాగే ఈ పాట ఆకట్టుకుంటుంది. పూజా, వెంకీ, వరుణ్ చిందేసిన ఈ సాంగ్ రిలీజైన కొద్ది గంటల్లోనే 2 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది.
కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని సమకూర్చగా, రాహుల్ సిప్లి గంజ్, గీతామాధురి పాడారు. అలాగే రాజు సుందరం కొరియో గ్రఫీని చేశారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. కాగా ఈ మూవీ ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.