Hi Nanna : ఫస్ట్ డే వరస్ట్ కలెక్షన్స్… నానికి మరో డిజాస్టర్ పడినట్టేనా?

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘హాయ్ నాన్న’ ఫస్ట్ డే వరస్ట్ కలెక్షన్స్ రాబట్టింది. దీంతో నాని ఖాతాలో మరో డిజాస్టర్ పడినట్టేనా ? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. మరి ఈ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత? బ్రేక్ ఈవెన్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే…

నాని, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘హాయ్ నాన్న’. ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీతో శౌర్యువ్ డైరెక్టర్ గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీలో నాని కూతురుగా బేబీ కియారా ఖన్నా నటించింది. డిసెంబర్ 7న ‘హాయ్ నాన్న’ మూవీ థియేటర్లలోకి రాగా ఫస్ట్ డే మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా వచ్చిన కలెక్షన్స్ చూస్తే నానికి మరో డిజాస్టర్ తప్పదా?  అనే అనుమానం కలుగుతుంది.

‘హాయ్ నాన్న’ మూవీ ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా 11 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను, ఐదున్నర కోట్ల షేర్ వసూళ్లను రాబట్టింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ ఫస్ట్ డే కేవలం రెండు కోట్ల 90 లక్షల కలెక్షన్స్ మాత్రమే రాబట్టుకుంది. హాయ్ నాన్న మూవీ తెలుగు రాష్ట్రాల్లో కంటే ఓవర్సీస్ లో పర్వాలేదనిపించింది. అక్కడ రెండు కోట్లకు పైగానే కలెక్షన్స్ దక్కించుకుంది. ఇక నైజాం ఏరియాలో కోటిన్నర వసూళ్లను రాబట్టి, మిగిలిన చోట్ల అతి తక్కువ కలెక్షన్స్ తో నిర్మాతల గుండెలు గుభేలుమన్పిపించింది. మొత్తానికి ఈ మూవీ నాని రీసెంట్ మూవీస్ లో అతి తక్కువ కలెక్షన్స్ రాబట్టి షాక్ ఇచ్చింది.

- Advertisement -

నాని లాస్ట్ మూవీ ‘దసరా’ ఫస్ట్ డే 14 కోట్ల వరకు కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఇక 100 కోట్లు కొల్లగొట్టిన ఆ మూవీ దరిదాపుల్లోకి కూడా ‘హాయ్ నాన్న’ రాలేకపోయింది. అంతేకాకుండా నాని కెరీర్ లో డిజాస్టర్ గా నిలిచిన ‘అంటే సుందరానికి’ మూవీకి ఫస్ట్ డే మూడు కోట్ల 80 లక్షలు కలెక్షన్స్ వచ్చాయి. ఈ మూవీ కంటే కూడా ‘హాయ్ నాన్న’కు ఇంకా తక్కువ కలెక్షన్స్ రావడం ఇక్కడ గమనించాల్సిన విషయం. అయితే ఆ ఎఫెక్ట్ అంతా కథదే అంటున్నారు సినీ విశ్లేషకులు. సాఫ్ట్ జోనర్ లో ఫీల్ గుడ్ మూవీగా వచ్చిన ఈ మూవీ కేవలం మల్టీప్లెక్స్ ప్రియులకు మాత్రమే నచ్చుతుందని, కానీ బీ, సీ సెంటర్లలో చూసే మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకోలేదని చెబుతున్నారు. నాని, మృణాల్ కెమిస్ట్రీ సిల్వర్ స్క్రీన్ పై ఫ్రెష్ గా కనిపించింది. అయితే కథలో మాత్రం ఆ ఫ్రెషనెస్ మిస్ అవ్వడంతో విమర్శలు ఎదుర్కొక తప్పలేదు నాని. ఇక ఈ మూవీ వరల్డ్ వైడ్ గా దాదాపుగా 27 కోట్ల వరకు ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. మరి ఈ మూవీ పరిస్థితి ఫస్ట్ డే నే ఇలా ఉంటే అసలు బ్రేక్ ఈవెన్ అవుతుందా? అనే డౌట్ వస్తోంది. మరి ఈ వీకెండ్ ‘హాయ్ నాన్న’ మూవీ కలెక్షన్స్ ఏమైనా ఊపందుకుంటాయేమో చూడాలి.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు