Nani: ఒక్క హిట్ పడగానే రేటు పెంచిన హీరో..!

నాచురల్ స్టార్ నాని ఇటీవల దసరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. నాని కెరీర్లోనే అత్యధికంగా 110కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా నాని కెరీర్లో తొలి పాన్ ఇండియా సినిమా కావటం మరో విశేషం. ఒక డెబ్యూ డైరెక్టర్ ని నమ్మి భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమా చేసినందుకు నానికి విమర్శకుల ప్రశంశలు కూడా అందాయి. ఇకపై తీయబోయే సినిమాల కథల విషయంలో జాగ్రత్తగా ఉండాలని డిసైడ్ అయిన నాని తన రేయునరేషన్ కూడా పెంచేశారని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం తన 30వ సినిమా షూట్ ని స్టార్ట్ చేసిన నాని తర్వాత డీవీవీ దానయ్య ప్రొడక్షన్ లో ఒక సినిమా చేయనున్నారు.
ఈ క్రమంలో నాని తన తర్వాత సినిమాకు గాను 20శాతానికి పైగా రెమ్యునరేషన్ పెంచినట్లు సమాచారం. కెరీర్లో తొలి 100కోట్ల మైలురాయిని చేరుకున్న నాని తన రెమ్యునరేషన్ పెంచటంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. అయితే, తెలుగులో తప్ప దసరా సినిమాకు ఇతర భాషల్లో పెద్దగా కలెక్షన్లు లేకపోవటం ఇక్కడ గమనించాల్సిన విషయం. తన 30వ సినిమాతో పాటు దానయ్య ప్రొడక్షన్స్ పై వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేయనున్న సినిమాకు 20కోట్లకు పైగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట నాని.
మొత్తానికి దసరా సినిమాతో టైర్ 1 హీరోల జాబితాలో చేరిన నాని, ఇకపై తాను తీయబోయే సినిమాల కథల విషయంలో జాగ్రత్త వహించి పెరిగిన మార్కెట్ రేంజ్ కాపాడుకుంటాడో లేదో చూడాలి. దసరా సినిమాతో తన కెరీర్లో తొలిసారి అవుట్ అండ్ అవుట్ మాస్ క్యారెక్టరైజేషన్ ఉన్న సినిమా తీసి హిట్ అందుకున్నాడు కాబట్టి ఈ పరంపరను కంటిన్యూ చేస్తూ మాస్ సినిమాలే తీస్తాడా లేక తన మార్క్ ఉన్న లవ్ స్టోరీస్ చేస్తారా అన్నది వేచి చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు