Rajinikanth: బాబీ అయినా సూపర్ స్టార్ కి హిట్ ఇవ్వగలడా..?

ప్రస్తుతం టాలీవుడ్ రేంజ్ జాతీయస్థాయి దాటి ఆస్కార్ చేరుకొని ఖండాంతరాలకు వ్యాపించింది. ఈ క్రమంలో ఇండియన్ టాప్ డైరెక్టర్స్ అందరూ టాలీవుడ్ స్టార్స్ తో సినిమాలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఎన్టీఆర్ వార్ 2లో ఛాన్స్ రావటం, మహేష్ బాబు,అల్లు అర్జున్ రామ్ చరణ్ లతో సినిమా చేయాలని వెట్రిమారన్ లాంటి దర్శకులు ప్రయత్నిస్తుండటం ఇందుకు నిదర్శనం. ఈ నేపథ్యంలో ఇటీవల వాల్తేరు వీరయ్య సినిమాతో చిరంజీవికి హిట్ ఇచ్చిన డైరెక్టర్ బాబీకి సూపర్ స్టార్ రజినీకాంత్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. ఇదిలా ఉండగా రోబో మినహా రజినీకి ఆ రేంజ్ లో చెప్పుకోదగ్గ హిట్ లేదు ఈ మధ్యకాలంలో, గతంలో మురుగదాస్, కార్తీక్ సుబ్బరాజ్ వంటి డైరెక్టర్స్ కూడా రజినీతో చేసే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు.

ఇటీవల వచ్చిన వాల్తేరు వీరయ్య, పవర్ సినిమాలు మినహా బాబీ కెరీర్లో చెప్పుకోదగ్గ హిట్స్ లేవు. అలాంటి బాబీకి సూపర్ స్టార్ రజినీకాంత్ తో సినిమా చేసే అవకాశం రావటం లక్ అనే చెప్పాలి. దిల్ రాజు నిర్మించబోతున్నారని టాక్ వినిపిస్తున్న ఈ సినిమా విషయంలో ఎలాంటి అధికారిక ప్రకటన లేదు గానీ దాదాపు ఈ ప్రాజెక్ట్ కన్ఫార్మ్ అయినట్టే అన్న సమాచారం అందుతుంది. ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తుంది కాబట్టి దిల్ రాజు ఈ సినిమాను కూడా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేయటానికే ప్లాన్ చేయచ్చు. మురుగదాస్ లాంటి స్టార్ డైరెక్టర్ దర్బార్ లాంటి స్టోరీతో రజినీకాంత్ ని సమర్థవంతంగా డీల్ చేయలేకపోయాడు.

కెరీర్ మొదటి నుండి కమర్షియల్ సినిమాలే తీస్తున్నా చెప్పుకోదగ్గ హిట్ లేని బాబీ సూపర్ స్టార్ స్టామినాని మ్యాచ్ చేయగలిగే కథ సిద్ధం చేస్తాడా లేదా అన్నదే ఇప్పుడు ప్రశ్న. అధికారికంగా ప్రకటన లేనప్పటికీ ఇండస్ట్రీ టాక్ గా మారిన ఈ కాంబినేషన్ కార్యరూపం దాల్చుతుందా లేదా, ఎన్నాళ్ళు గానో రజినీ రేంజ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న అభిమానుల కల నెరవేరుతుందా లేదా అన్నది వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు