PSPK: ఈ నాలుగు సినిమాల్లో ఏది ముందొస్తుంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నాలుగు సినిమాల్లో నటిస్తున్నాడు. ఎలక్షన్లు దగ్గరికి వస్తున్నందున జనసేన పనుల్లో బిజీ అవుతూనే ఈ సినిమా షూటింగుల్లో పాల్గొంటున్నాడు. ముందుగా హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ చేస్తున్న పవన్ కళ్యాణ్, దాంతో పాటు సముద్రఖని డైరెక్ట్ చేస్తున్న వినోద సితం సినిమా రీమేక్ లోను పాల్గొంటున్నాడు. ఈ సినిమా లో మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. తదుపరి సాహొ మూవీ డైరెక్టర్ సుజీత్ డైరెక్షన్ లోను నటిస్తున్నాడు. ఈ సినిమాకు OG అనే టైటిల్ పరిశీలన లో ఉంది. ఇక వీరందరికంటే ముందు క్రిష్ తో హరి హర వీరమల్లు మూవీ స్టార్ట్ చేశాడు. ఈ సినిమా వకీల్ సాబ్ కంటే ముందు మొదలైంది.పీరియాడిక్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ మూవీ లో భారీ తారాగణం నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీ గా 5 భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

అయితే పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ నాలుగు సినిమాల్లో ఏది ముందు రిలీజ్ అవుతుందో తెలియక ఫ్యాన్స్ తో పాటు ట్రేడ్ విశ్లేషకులు కూడా తేల్చలేక పోతున్నారు. అయితే ఈ సినిమాల్లో అన్నిటికంటే ముందు స్టార్ట్ అయింది మాత్రం హరి హర వీరమల్లు. కానీ ఈ సినిమా 2023 లో విడుదల కావడం కష్టం. ఎందుకంటే ఇప్పటి వరకు 60 శాతం మాత్రమే షూటింగ్ అయింది. క్రిష్ ఇంకా స్క్రిప్ట్ పనుల్లో ఉన్నాడు. ఇక సుజీత్ తో తీస్తున్న ‘ఓజీ’ ఈ మధ్యనే స్టార్ట్ అయింది. కాబట్టి అది ఖచ్చితంగా 2024 లో నే వస్తుంది. ఇప్పుడు హరీష్ శంకర్ తీస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో పవన్ కళ్యాణ్ బిజీ గా ఉన్నాడు. అయితే ఈ సినిమా ఇప్పటి వరకు 50 శాతం కూడా కంప్లీట్ అవలేదు. అయినా 2023 చివర్లో తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ సినిమాల్లో 2023 లో విడుదలయ్యే సినిమా సముద్ర ఖని తో చేస్తున్న వినోద సితం రీమేక్ కావొచ్చు అంటున్నారు. ఎందుకంటే ఈ మూవీ దాదాపు 60 శాతం కంప్లీట్ అయ్యింది. పైగా ఈ సినిమాలో మెయిన్ లీడ్ సాయి ధరమ్ తేజ్. పవన్ కళ్యాణ్ గోపాల గోపాల సినిమా తరహా లో ఈ మూవీ లో తన క్యారెక్టర్ ఉంటుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ కి సంబంధించిన షూట్ ఎక్కువగా ఉండదు. ఈ సినిమాను 2023 ద్వితీయార్ధం లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

For More Updates :

- Advertisement -

Checkout Filmify for the latest Movie updates,Gossips, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు