SSMB28 :త్రివిక్రమ్ సినిమాలో మహేష్ డబుల్ యాక్షన్

మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమా మీద ఎన్ని అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాలిసిన పని లేదు. దాదాపు 13 ఏళ్ళ గ్యాప్ తర్వాత వీళ్లిద్దరు కలిసి చేస్తున్న సినిమా అవడంతో సినిమా మీద చాలా ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి . ఇప్పటికే వీళ్ళ కాంబోలో వచ్చిన అతడు , ఖలేజా సినిమాలు ఎవర్ గ్రీన్ సూపర్ హిట్ లుగా నిలిచాయి. మహేష్ ని ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో త్రివిక్రమ్ కి బాగా తెల్సు అందుకే వీళ్లిద్దరి కాంబో సినిమా చూడాలని ఎప్పటి నుంచో ఫ్యాన్స్ ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఇన్నాళ్ళకి వాళ్ళ వెయిటింగ్ ఫలించింది.

హారిక & హాసిని క్రియేషన్స్ లో మహేష్ -త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కి సంబంధించి ఇటీవలనే ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. మార్కెట్ యార్డ్ లో విలన్స్ ని కొట్టి స్టైల్ గా సిగరెట్ తాగుతూ వస్తోన్న మహేష్ స్టైల్ చూసి ఫ్యాన్స్ చాల హ్యాపీ గా ఫీల్ అయ్యారు. మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాల పుణ్యమా అని మహేష్ లోని మాస్ , కామెడీ యాంగిల్ ఫ్యాన్స్ చాల మిస్ అయ్యారు. అయితే త్రివిక్రమ్ ఆ పాత మహేష్ ని మళ్ళీ బయటికి తీసుకొస్తున్నారని పోస్టర్ ని చూసి ఫిక్స్ అయి పోయారు .

అయితే విషయానికొస్తే మహేష్- త్రివిక్రమ్ కాంబో వస్తున్నసినిమాలో మహేష్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నారంట. తండ్రి , కొడుకు రెండు పాత్రలలో మహేషే కనిపించబోతున్నారంట. అప్పుడెప్పుడో నాని సినిమాలో మహేష్ కొన్ని క్షణాల పాటు ఓల్డ్ గెటప్ లో కనిపించారు. ఆ తరువాత మహేష్ అలాంటి ఎక్సపెరిమెంట్ రోల్స్ చేయలేదు.మళ్ళీ ఇన్నాళ్ళకి మహేష్ ఇలా కొత్త గెటప్ లో కనిపించబోతున్నారు.

- Advertisement -

త్రివిక్రమ్ సినిమా తరువాత మహేష్ రాజమౌళి తో సినిమా చేయనున్నారు. ఈ సినిమా అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ లో కొనసాగుతుంది అని న్యూస్ వినిపిస్తోంది అయితే ఇదే గాని నిజం అయితే మనం ఎప్పుడు చూడని గెటప్స్ మహేష్ ని చూడబోతున్నాం అన్నమాట

 

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు