Biju menon : ఈ టాలీవుడ్ విలన్ భార్యను చూసారా.. హీరోయిన్ లు కూడా దిగదుడుపే..!

Biju menon : తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతోమంది హీరో హీరోయిన్లతో పాటు చాలామంది నటీనటులు కూడా ఎంట్రీ ఇస్తూ ఉంటారు.. కొంతమంది విలన్ గా కూడా ఎంట్రీ ఇచ్చి బాగానే పాపులారిటీ సంపాదించుకున్న వారు ఉన్నారు.. అలాంటి వారిలో నటుడు బిజు మీనన్ కూడా ఒకరు.. నిజానికి మలయాళంలో బిజీ ఆర్టిస్టుగా పేరుపొందిన ఈ నటుడు టాలీవుడ్లో మాత్రం రణం, ఖతర్నాక్ వంటి చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు.. అయితే ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీలో పెద్దగా అవకాశాలు అయితే రాలేదు.. దీంతో మలయాళం ఇండస్ట్రీలో పలు చిత్రాలలో నటిస్తూ మంచి క్రేజ్ సంపాదించుకున్నారు బిజు మీనన్ ..

బిజు మీనన్ భార్య..

మలయాళం లో అయ్యప్పన్ కోషియమ్ సినిమాతో ఒక్కసారిగా ఈ నటుడు రేంజ్ పెరిగిపోయింది.. అయితే ఈయన భార్య సంయుక్త వర్మ కూడా ఒక సినిమా నటి అనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.. ఈమె మలయాళం సినీ ఇండస్ట్రీలో కూడా గతంలో హీరోయిన్గా ఉండేదట. అయితే బిజు మీనన్ ను వివాహం చేసుకున్న తర్వాత నటనకు గుడ్ బాయ్ చెప్పేసింది.. ఇప్పుడు తాజాగా కేరళలో గురువాయూర్ ఆలయంలో తన భర్తతో కలిసి సంయుక్త వర్మ కనిపించారు.

చీరకట్టు లో సంయుక్త అదుర్స్..

అయితే వీరిద్దరూ చాలా అరుదుగా బయట బహిరంగ ప్రదేశాలలో దర్శనం ఇస్తూ ఉంటారు. సంయుక్త కూడా చాలా సాంప్రదాయమైన పద్ధతిలో చీరకట్టులో కనిపిస్తోంది. బీజు మీనన్ ( Biju menon ) కూడా చాలా సాంప్రదాయమైన దుస్తులలోనే వెళ్లారు.. సంయుక్త వర్మ విషయానికి వస్తే త్రిసూర్ కి చెందిన ఈమె కేరళ లోని వర్మ కాలేజీలో చదువుకుంటున్న సమయంలో విండుం చీల భూకార్యమనల్ వంటి సినిమాతో మొదటిసారిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ తర్వాత కేవలం ఈమె నాలుగు , ఐదు చిత్రాలలో మాత్రమే నటించినట్లు తెలుస్తోంది.

- Advertisement -

బిజు – సంయుక్త ప్రేమ , పెళ్ళి..

ఈ అందగత్తె ఎవరబ్బా.. సంయుక్త వర్మ నటించిన ప్రతి పాత్ర కూడా బలమైన పాత్ర కావడంతో ప్రేక్షకుల హృదయాలలో నిలిచిపోయింది. ఇక వెండితెర పై నటిస్తున్నప్పుడే బిజు మీనన్ తో సంయుక్త వర్మ ప్రేమించుకొని వివాహం చేసుకున్నారు. వివాహ అనంతరం ఈమె ఒక గృహిణిగా మారిపోయింది.. అంతేకాకుండా ఈమె యోగాను అభ్యసించి యోగశిక్షకురాలుగా కూడా మారినట్లు తెలుస్తోంది. బీజు మీనన్ దాదాపుగా తెలుగు ఇండస్ట్రీలో ఏ ఒక్క సినిమాలో కూడా నటించలేదు.. కానీ అభిమానులు అయితే తిరిగి రీ ఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నారు.. అలాగే వీరి ఫోటోలు చూసిన అభిమానులు సైతం పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు