Kalki: కల్కిలో ప్రభాస్ పాత్ర పై నిర్మాత హాట్ కామెంట్స్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో బాహుబలి సినిమా తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నటువంటి చిత్రాలలో కల్కి 2898AD సినిమా కూడా ఒకటి. ఇందులో ప్రభాస్ హీరోగా నటిస్తూ ఉండగా.. డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు.. ఈ చిత్రాన్ని అశ్వనీ దత్ సమర్పణలో వైజయంతి మూవీస్ బ్యానర్ పైన స్వప్న దత్ కూడా భారీ బడ్జెట్లోనే నిర్మిస్తూ ఉన్నారు.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా చివరి దశలో జరుపుకుంటుంది.. ఈ చిత్రంలో ప్రభాస్ భైరవ అనే పాత్రలో నటిస్తున్నట్లు ఇటీవల చిత్ర బృందం కూడా తెలియజేయడం జరిగింది..

ప్రభాస్ పాత్రపై క్లారిటీ..

తాజాగా ఈ పాత్ర గురించి నిర్మాత స్వప్నా దత్ ఒక సౌత్ ఇండియా ఫిలిం ఫెస్టివల్ లో భాగంగా పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది.. ప్రభాస్ పోషిస్తున్నటువంటి భైరవ పాత్ర కొన్నేళ్లపాటు అభిమానుల గుండెల్లో నిలిచిపోతుందంటూ స్వప్న దత్ తెలియజేసింది.. అందుకు సంబంధించి ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది.. ఈ చిత్రం మే 9వ తేదీన రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ తెలియజేశారు. అయితే అదే సమయంలో అటు అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు కూడా జరగబోతున్నాయి

- Advertisement -

రిలీజ్ డేట్ పై సందేహం..
దీంతో ఇప్పుడు ఈ సినిమా విడుదల తేదీ పైన చాలా అనుమానాలు అయితే నెలకొంటున్నాయి అభిమానులలో.. పార్టీ ప్రచారాల వల్ల చాలామంది ప్రజలు కూడా థియేటర్లకు రాలేని పరిస్థితి ఉంటుందని.. పార్లమెంట్ ఎన్నికల కారణంగా పాన్ ఇండియా మార్కెట్ పైన కచ్చితంగా ఎఫెక్ట్ చూపిస్తుందని.. ముఖ్యంగా భారీ బడ్జెట్ సినిమా కావడంతో సినిమా టికెట్ ధరలను కూడా పెంచే అవకాశం ఉండదని ఇలాంటి సమయంలో ఇంతటి భారీ బడ్జెట్ సినిమా రిలీజ్ చేస్తే ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుందని చెప్పవచ్చు.

కల్కి మూవీ లో స్టార్ కాస్ట్..

మరి రిలీజ్ విషయం పైన చిత్ర బృందం నిర్మాతలు ఎలా ముందుకు కొనసాగుతారో చూడాలి మరి.. అయితే ఈ చిత్రంలో హీరోయిన్స్ గా దీపికా పదుకొనే, దిశా పటానీ నటిస్తూ ఉన్నారు అలాగే విలన్ గా కమలహాసన్ నటిస్తూ ఉండగా కీలకమైన పాత్రలో అమితాబ్ బచ్చన్, రాజేంద్రప్రసాద్ తదితరులు నటిస్తూ ఉన్నారు. అయితే కథ కొద్ది రోజుల నుంచి హీరో రానా ,దుల్కర్ సల్మాన్, నాని, మృణాల్ ఠాకూర్, విజయ్ దేవరకొండ వంటి వారు కూడా నటించబోతున్నట్లు వార్తలయితే వినిపిస్తున్నాయి అయితే ఈ విషయం పైన ఇప్పటివరకు ఏ ఒక్కరు కూడా క్లారిటీ ఇవ్వలేదు. అయితే స్వప్న దత్ మాట్లాడినటువంటి ఒక వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది.

ఖుషీ లో ఫ్యాన్స్..

ప్రభాస్ పాత్ర గురించీ స్వప్న దత్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఖుషీ అవ్వడమే కాదు ఇది కదా మాకు కావాల్సింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు