SK19: మహావీరుడు పై సినిమా యూనిట్ హోప్స్  వదులుకుందా..?

కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ అధితి శంకర్ హీరో హీరోయిన్లుగా నటించిన మహావీరుడు సినిమా జులై 14న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ప్రమోషన్స్ నామమాత్రంగా ఉండటం వల్ల పెద్దగా హైప్ క్రియేట్ కాలేదు, దీంతో రిలీజ్ ఉన్న సంగతి కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. నిజానికి శివకార్తికేయన్ కి తెలుగులో పెద్దగా మార్కెట్ లేనప్పటికీ వరుణ్ డాక్టర్, డాన్ వంటి సినిమాలకు మంచి ఆదరణ లభించింది. ఆ మధ్య రిలీజ్ గత సంవత్సరం వచ్చిన ప్రిన్స్ అంచనాలు అందుకోలేకపోయిన పర్వాలేదనిపించింది. ప్రస్తుతం తెలుగులో బేబీ మినహా పెద్దగా సినిమాలు లేని నేపథ్యంలో మహావీరుడు సినిమా యూనిట్ ప్రమోషన్స్ మీద కాస్త దృష్టి పెట్టుంటే గనక సినిమాకి మినిమమ్ బజ్ అయినా క్రియేట్ అయ్యుండేది.

వరుణ్ డాక్టర్, డాన్ సినిమాలు కూడా ఇలాగే పెద్దగా ప్రమోషన్స్ లేకుండా రిలీజ్ అయ్యి మౌత్ టాక్ తో హిట్స్ గా నిలిచాయి. చూస్తుంటే ఈ సినిమాకు కూడా అదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నటు ఉన్నారు మేకర్స్. అయితే, బేబీ సినిమా ఇప్పటికే ట్రైలర్, సాంగ్స్ ద్వారా మంచి బజ్ సొంతం చేసుకున్న నేపథ్యంలో మహావీరుడు మొదటి రోజే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంటే తప్ప గట్టెక్కే పరిస్థితి కనిపించట్లేదు.

ట్రైలర్ ద్వారా ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచిన ఈ సినిమాకు సరైన ప్రమోషన్స్ లేకపోవటం మైనస్ అనే చెప్పాలి. పది కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా రిలీజ్ అవుతున్న ఈ సినిమాకి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ చాలా కీలకం అని చెప్పాలి. ప్రమోషన్స్ పెద్దగా లేని క్రమంలో మహావీరుడుకి ఫస్ట్ షో నుండే హిట్ టాక్ వస్తే తప్ప ఆ టార్గెట్ రీచ్ అయ్యే అవకాశం కనిపించట్లేదు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు