Baby: ప్రీమియర్లకు సూపర్ రెస్పాన్స్ – బ్లాక్ బస్టర్ ఖాయమేనా..?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరో, హీరోయిన్లుగా కలర్ ఫోటో ద్వారా నేషనల్ అవార్డు అందుకున్న సాయి రాజేష్ డైరెక్షన్లో బేబీ సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. జులై 14న రిలీజ్ కి సిద్ధంగా ఉన్న ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదలై అందరిని ఆకట్టుకొని సినిమాపై అంచనాలను పెంచింది. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు అన్నీ బ్లాక్ బస్టర్స్ అవ్వగా సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి. ఇటీవల ప్రీమియర్ కల్చర్ పెరిగిపోవటంతో ఈ సినిమాకు కూడా రిలీజ్ కి ముందు రోజే పలు చోట్ల ప్రీమియర్ షోలను ప్లాన్ చేసింది సినిమా యూనిట్, ఈ ప్రీమియర్స్ కి రికార్డ్ స్థాయిలో బుకింగ్స్ వచ్చిన తెరుణంలో సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందన్న నమ్మకంతో ఉంది సినిమా యూనిట్.

ప్రీమియర్ షోల ద్వారా మంచి టాక్ అందుకొని బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి సామజవరగమన వంటి చిన్న సినిమాలు. బేబీ సినిమాకు కూడా అదే రిజల్ట్ రిపీట్ అవుతుందని ధీమా వ్యక్తం చేస్తోంది సినిమా యూనిట్. కలర్ ఫోటో లాంటి ప్యూర్ లవ్ స్టోరీ కావతంతో బేబీ సినిమా మీద మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ట్రైలర్, సాంగ్స్ ద్వారా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది కాబట్టి ప్రీమియర్స్ కి డీసెంట్ టాక్ వస్తే గనక ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వటం ఖాయం అని అనిపిస్తోంది.

కెరీర్ ఆరంభం నుండి కథాబలం ఉన్న సినిమాలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ సరైన హిట్ అందుకోలేకపోయాడు ఆనంద్ దేవరకొండ. ఈ క్రమంలో ట్రైలర్, సాంగ్స్ తో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా హిట్ అవ్వటం ఆనంద్ కి కీలకం అని చెప్పాలి. కలర్ ఫోటో ద్వారా నేషనల్ అవార్డు అందుకున్న తర్వాత సాయిరాజేష్ డైరెక్ట్ చేస్తున్న సినిమా కావటంతో మంచి అంచనాలు నెలొకొన్న బేబీ సినిమా మరొక కలర్ ఫోటో అవుతుందా లేదా అన్నది వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు