Citadel: సమంత ఇక సినిమాలకు బ్రేక్ ఇచ్చినట్టేనా..!

లేడి సూపర్ స్టార్ సమంత సోషల్ మీడియాలో ఏం పోస్ట్ చేసినా కూడా వైరల్ అవుతూ వస్తోంది ఈ మధ్య. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ఖుషి సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉండగా వరుణ్ ధావన్ తో కలిసి నటించిన సిటాడెల్ ఇండియన్ వర్షన్ వెబ్ సిరీస్ షూటింగ్ తాజాగా ముగిసింది. ఇందుకు సంబంధించి సమంత షేర్ చేసిన ఇంస్టాగ్రామ్ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. షూటింగ్ పూర్తైన విషయాన్ని తెలియజేస్తూ సమంత పోస్ట్ చేసిన ఫోటోకి నెటిజన్లు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. సమంత ఒక సంవత్సరం పాటు సినిమాలకు గ్యాప్ ఇవ్వనుందని వార్తలొచ్చిన నేపథ్యంలో సమంత సినిమాలకు గుడ్ బై చెప్పనుందా అంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

ప్రస్తుతం సమంత లైనప్ లో ఒక్క సినిమా కూడా లేకపోవటమే ఇందుకు కారణం అని చెప్పవచ్చు. అయితే, సిద్ధూ జొన్నలగడ్డ నందిని రెడ్డి కాంబినేషన్లో రానున్న సినిమాతో పాటు నీరజ కోన డైరెక్షన్లో సిద్దు నటించబోయే సినిమాలో కూడా సమంత హీరోయిన్ గా నటించనుందని వార్తలు వచ్చినప్పటికీ ఆ ప్రాజెక్ట్స్ కి సమంత నో చెప్పినట్టు సమాచారం అందుతోంది.

మాయోసైటిస్ వ్యాధి నుండి కోలుకున్న తర్వాత వరుసగా సినిమాలతో బిజీ అయిన సమంత సినిమాలకు గ్యాప్ ఇచ్చి రిలాక్స్ అవ్వాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అందుకే ఖుషి, సిటాడెల్ తర్వాత ఏ ప్రాజెక్ట్ కి కమిట్ అవ్వలేదని అంటున్నారు. సిటాడెల్ ద్వారా పాన్ ఇండియా వైడ్ ఫోకస్ సంపాదించిన సమంత ఇంతలోనే సినిమాలకు గ్యాప్ ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం ఏ రకమైన ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు