Harihara Veeramallu : పండక్కి దెబ్బేసారు.. అదే కారణమా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమాల లెక్క ఎటూ తేలకుండా ఉండడంతో రిలీజ్ డేట్ల విషయంలో చాలా గందరగోళం నెలకొని ఉంది. పవన్ కళ్యాణ్ రాజకీయాల బిజీ నేపథ్యంలో ఈ సినిమాలు వాయిదా పడ్డాయన్న సంగతి తెలిసిందే. లేకపోతే వీటిలో ఓ సినిమా ఈపాటికి రిలీజ్ అయ్యి, మరొకటి రిలీజ్ కి రెడీ గా ఉండేది. దాదాపు గత మూడు నెలలుగా పవన్ కళ్యాణ్ ఏపీ లో జరగబోతున్న ఎన్నికల హడావుడి లో ఉన్న విషయం తెల్సిందే. తన సినిమాల షూటింగ్స్ కు పూర్తి దూరంగా ఉంటు రాజకీయాలపైనే పవన్ దృష్టి పెట్టాడు. దాంతో ఇప్పటికే ప్రారంభం అయిన హరి హర వీరమల్లు, ఓజీ మరియు ఉస్తాద్‌ భగత్ సింగ్ సినిమాలు ఆగిపోయాయి.

పండక్కి దెబ్బేసిన మేకర్స్.. నిరాశ లో ఫ్యాన్స్..

పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమాల్లో హరిహర వీరమల్లు భారీ హిస్టారికల్ మూవీగా దాదాపు నాలుగేళ్లుగా తెరకెక్కుతుందన్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి చాలా రోజులయింది. అలాగే పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ కూడా షూటింగ్ ఆగిపోగా, మేకర్స్ నుండి ఉస్తాద్‌ భగత్‌ సింగ్ మరియు హరి హర వీరమల్లు సినిమాల సందడి మాత్రం లేదు. ఇక ఉస్తాద్‌ భగత్‌ సింగ్ దర్శకుడు హరీష్‌ శంకర్‌ ఎలక్షన్స్ అయిపోయే వరకు పవన్ ఎలాగూ రాడని గ్రహించి ఇప్పటికే మరో సినిమాను మొదలు పెట్టాడు. ఇక హరి హర వీరమల్లు సినిమా దర్శకుడు క్రిష్ కూడా వేరే ప్రాజెక్ట్‌ లతో బిజీగా ఉన్నాడు. మొన్నటి వరకు ఓజీ సినిమా షూటింగ్‌ పవన్‌ లేకుండానే జరుగుతుందనే ప్రచారం జరిగింది. కానీ అలా ఏమి జరగలేదు. ఈ మూడు సినిమాల్లో కూడా కదలిక ఏపీ అసెంబ్లీ ఎన్నికల తర్వాతే అన్నట్టుగా అంతా భావిస్తున్నారు.

- Advertisement -

అదే కారణమా?

ఇలాంటి సమయంలో హరి హర వీరమల్లు సినిమా నుంచి టీజర్ రాబోతుందని, మహా శివరాత్రి కానుకగా టీజర్ తో పాటు, రిలీజ్ డేట్ అప్డేట్ వస్తుందని రెండు వారాల కింద మేకర్స్ అఫిషియల్ గా చెప్పారు. కానీ షూటింగ్‌ ఇంకా చాలా బ్యాలన్స్ ఉంది. పవన్‌ ఎప్పుడు డేట్లు ఇచ్చేదని కూడా క్లారిటీ లేదు. అయినా కూడా టీజర్ వస్తుందని మేకర్స్ అనౌన్స్ చేసారు. కానీ శివరాత్రి కే వీరమల్లు సినిమా అప్డేట్ ఇవ్వాలని ట్రై చేసినా ఫైనల్ గా కుదరలేదు. దాంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. అయితే దీనికి కారణం దర్శకుడు క్రిష్ అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. గత కొన్ని రోజుల కింద డ్రగ్ మాఫియా నేపథ్యంలో క్రిష్ కూడా అనుమానితుడిగా ఉండడం వల్ల కొన్ని రోజుల పాటు పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరిగాడు క్రిష్ అందువల్లే వీరమల్లు శివరాత్రి టీజర్ రాలేదని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఒక రకంగా ఇది నిజమే అనిపిస్తుంది.

అయితే ఫ్యాన్స్ ఆత్రుతని అర్ధం చేసుకుని మేకర్స్ తొందర్లోనే ఒక మంచి సందర్భంలో టీజర్ ను ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. క్రిష్ ప్రస్తుతం ఆ పనిలోనే ఉన్నాడని, ఎన్నికలు పూర్తి అయిన వెంటనే పవన్‌ కళ్యాణ్ మొదట ఇచ్చే డేట్లతో హరి హర వీరమల్లు షూటింగ్‌ పూర్తి చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఇదే ఏడాది చివరి వరకు వీరమల్లు విడుదల చేయాలని క్రిష్ భావిస్తున్నాడట. అయితే ముందు టీజర్ రిలీజ్ అయితే గాని రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చేలా లేదు.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు