Raashi khanna : కొత్త జోష్ లో రాశి ఖన్నా..

టాలీవుడ్ లో పదేళ్ల కింద “ఊహలు గుసగుసలాడే” అనే చిన్న క్లాసిక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి తెలుగు ఆడియన్స్ ని తన క్యూట్ నెస్ తో గ్లామర్ తో కట్టిపడేసిన సుందరి రాశిఖన్నా. యూత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ ఈమె. చక్కటి తెలుగు మాట్లాడే తక్కువ మంది హీరోయిన్లలో రాశి ఖన్నా ఒకరు. అందుకే తక్కువ సినిమాలు చేసినా తెలుగులో మంచి క్రేజ్ సంపాదించింది. తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. ఇక తెలుగుతో పాటు తమిళంలో కూడా అదే రేంజ్ క్రేజ్ ను సంపాదించుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత బాలీవుడ్ లోకి అడుగుపెట్టి బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టుల్లో నటిస్తూ దూసుకుపోతుంది. అయితే టాలీవుడ్‌లో ఒకప్పుడు వరుస సినిమాలు చేసి ఓ వెలుగు వెలిగిన రాశీ ఖన్నా.. ఇప్పుడు బాలీవుడ్ లో బిజీ బిజీగా గడుపుతోంది. నార్త్ లో హవా కొనసాగిస్తోంది. టాలీవుడ్ లో చివరగా పక్కా కమర్షియల్ సినిమాతో సందడి చేయగా ఆ సినిమా అంతగా ఆడలేదు. ఇక రాశిఖన్నా తెలుగులో సినిమా చేసి రెండేళ్లు కావస్తుంది. తెలుగులోనే కాదు అసలు సౌత్ లో కూడా ఏ సినిమా చేయలేదు.

బాలీవుడ్ లో వరుస ప్రాజెక్టులు..

తెలుగులో రెండేళ్ల వరకూ ఏ సినిమాలోనూ కనిపించలేదు రాశి ఖన్నా. అయితే హిందీలో మాత్రం దున్నేస్తుందని చెప్పాలి. ఫర్జి వెబ్ సిరీస్ తో హిందీలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ భామ హిందీలో ప్రస్తుతం నాలుగు సినిమాల్తో బిజీగా ఉంది. అలాగే ఓ తమిళ సినిమా, మరో తెలుగు సినిమాలో నటిస్తుంది. ఇక రాశి ఖన్నా హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ హిందీ మూవీ యోధ రిలీజ్ కి రెడీ గా ఉన్న నేపథ్యంలో బాలీవుడ్ లో ప్రమోషన్లతో బిజీ అయింది. ఇక పనిలో పనిగా తన గ్లామర్ షో తోనూ సోషల్ మీడియా లో అట్రాక్ట్ చేస్తుంది. అయితే సోషల్ మీడియాలో రాశీ ఖన్నా గ్లామర్ షో మాములుగా ఉండదు. క్లీవేజ్, థైస్ షోతో నెట్టింట ఎప్పటికప్పుడు హీట్ పుట్టిస్తుంటోంది. ఈ మధ్య బాలీవుడ్ లో ఫుల్ బిజీ అవ్వడానికి గ్లామర్ డోస్ ఓ రేంజ్ లో పెంచేసింది. తాజాగా యోధ ప్రమోషన్లు చేస్తూనే అదే కాస్ట్యూమ్స్ తో కొత్త ఫొటోలు షేర్ చేసింది రాశీ ఖన్నా.

- Advertisement -

ఫిట్ నెస్ బ్యూటీ కొత్త జోష్..

తాజాగా ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేసిన ఫొటోల్లో బాటిల్ గ్రీన్ టైట్ ఫిట్ డ్రెస్ లో దిగిన లుక్స్ లో మెరిసిపోతుంది. మెలికలు తిరుగుతూ పోజులిచ్చి నెటిజన్లను కట్టిపడేస్తోంది. నాజూకైన నడుము అందాలను చూపిస్తూ ఫిదా చేస్తోంది. ప్రస్తుతం రాశి గ్లామర్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే రెండేళ్ల వరకూ ఒక్క సినిమా కూడా లేకుండా ఖాళీగా ఉన్న ఈ భామ ప్రస్తుతం అరడజనుకి పైగా సినిమాలతో ఒక్కసారిగా బిజీ అయ్యి, కొత్త జోష్ లో ఉంది. మొన్న మొన్నటివరకూ షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ తో గడిపేసిన రాశి, ఇప్పుడు సినిమాల ప్రమోషన్లలో బిజీ గా ఉంది. ఇక బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో రాశీ ఖన్నా నటించిన యోధ మూవీ త్వరలోనే రిలీజ్ కానుంది. ఈ వార్ ఓరియెంటెడ్ సినిమా ప్రమోషన్లలోనే రాశి ఖన్నా బిజీగా గడుపుతోంది. ఇక త్వరలోనే ‘తెలుసు కదా’ అనే సినిమాతో పాటు మరో తెలుగు సినిమా కూడా చేయనుంది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు