Saithan : మరోసారి బాలీవుడ్ లో తన సత్తా చాటుతున్న మాధవన్..

ప్రముఖ కోలీవుడ్ హీరో మాధవన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు లవర్ బాయ్ గా, ఇప్పుడు వెర్సెటైల్ నటుడిగా, అన్ని రకాల పాత్రలతో బిజీ అవుతున్న ఈ హీరో ప్రస్తుతం ఏ ఇండస్ట్రీ లోనైనా దున్నేస్తున్నాడనే చెప్పాలి. కొన్నేళ్ల కింద హిట్ల కోసం సతమతమైన ఈ హీరో సుధా కొంగర తీసిన ఇరుది సుట్రు కం బ్యాక్ ఇచ్చాడు. ఇక అక్కడినుండి గేర్ మార్చి హీరోగా అలాగే కొన్ని సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో, అలాగే ప్రతినాయకుడిగానూ నటిస్తూ మెప్పిస్తున్నాడు. ఇక తాజాగా బాలీవుడ్ లో రిలీజ్ అయిన ఓ సినిమా ఆడియన్స్ ని మెప్పిస్తుంది. ఆ సినిమాయే “సైతాన్”. తెలుగులో తాజాగా రిలీజ్ అయిన గామి, భీమా, ప్రేమలు సినిమాల ఊపులో ఈ సినిమా గురించి జనాలు తెలుసుకోలేదు. కానీ వీటితో పాటే మొన్న రిలీజ్ అయిన బాలీవుడ్ మూవీ సైతాన్ మంచి అంచనాల మధ్య థియేటర్లలో విడుదలైంది.

మాధవన్ పాత్రే కీలకం..

అజయ్ దేవగన్ జ్యోతిక మెయిన్ లీడ్స్ గా నటించిన సైతాన్ సినిమా ఓ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కగా, ఈ సినిమాలో అజయ్ దేవగన్ మాత్రమే హీరో అయితే అంత ఆసక్తి కలిగేది కాదేమో. ఎందుకంటే అతి తక్కువ మంది నటీనటులు నటించిన ఈ సినిమాలో మాధవన్, జ్యోతిక లాంటి సౌత్ క్యాస్టింగ్ ఉండటం వల్ల ఇక్కడ ఆడియన్స్ కి కూడా ఇంట్రస్ట్ కలిగించింది. ఇక లాస్ట్ ఇయర్ గుజరాతి భాషలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన “వష్” మూవీ కి రీమేక్ గా తెరకెక్కిన సైతాన్ కేవలం 20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కడం విశేషం. అయితే 14 కోట్లకు పైగా ఓపెనింగ్స్ వచ్చినా ఈ సినిమాకు మిక్సడ్ టాక్ వచ్చింది. అయితే సోలో రిలీజ్ కావడంతో మంచి ఓపెనింగ్స్ దొరికాయని చెప్పొచ్చు.

- Advertisement -

మాధవన్ కిల్లింగ్ పెర్ఫార్మన్స్..

ఈ సినిమాలో కథ విషయానికి వస్తే.. కబీర్(అజయ్ దేవగన్) జ్యోతి(జ్యోతిక) భార్యా భర్తలు. టీనేజ్ కూతురు జాన్వీ (జంకీ బొదివాలా) తో కలిసి సెలవుల కోసం స్వంత గ్రామానికి వెళ్లే క్రమంలో ఓ రెస్టారెంట్ లో ‘వన్ రాజ్’ (మాధవన్) పరిచయమవుతాడు. ఆ జంట గెస్ట్ హౌస్ కు చేరుకున్నాక సెల్ ఫోన్ లో ఛార్జింగ్ అయిపోయిందనే వంకతో వన్ రాజ్ వీళ్ళుండే చోటుకి వస్తాడు. మెల్లగా జాన్వీతో పరిచయం పెంచుకుని వశీకరణ విద్య ద్వారా తానేం చెబితే అది చేసే దారుణమైన స్థితికి తీసుకెళ్తాడు. వన్ రాజ్ మాములు మనిషి కాదని గుర్తించిన కబీర్ తన కుటుంబాన్ని ఆ దుర్మార్గుడి నుంచి ఎలా కాపాడుకున్నాడనేదే కథ. భారీ మలుపులు లేకపోయినా థ్రిల్స్ కు లోటు లేకుండా దర్శకుడు వికాస్ బహ్ల్ స్క్రీన్ ప్లే అల్లాడు. అలా అనడం కంటే ఒరిజినల్ ని ఉన్నది ఉన్నట్టు తీసాడు అనొచ్చు.

అయితే తెలుగులో ఈ మధ్య చూసిన మా ఊరి పొలిమేర లాంటి హారర్ రేంజ్ లో తెలుగు ఆడియన్స్ కి మెప్పించకపోవచ్చు. కానీ సైతాన్ సినిమాలో మాధవన్ పెర్ఫార్మన్స్ మాత్రం ఓ రేంజ్ లో ఇంప్రెస్ చేస్తుందని చెప్పాలి. ఒక అమ్మాయిని వశపరుచుకొని తల్లితండ్రులను భయపెడుతూ క్రూరత్వంతో నిండిన విలనిజంని అద్భుతంగా పండించాడు. ఇక అజయ్, జ్యోతిక తమ పరిధి మేరకు వారి పాత్రల్లో చక్కగా నటించినా సినిమా చూసిన తర్వాత మాధవన్ పాత్ర మాత్రమే గుర్తుంటుంది. పైగా టైటిల్ రోలే మాధవన్ పోషించడం విశేషం.

ఇక తెలుగులో కొన్నేళ్ల కింద నాగ చైతన్య హీరోగా నటించిన సవ్యసాచి లో కూడా మాధవన్ విలన్ గా నటించి అద్భుతంగా మెప్పించాడు. అయితే ఆ సినిమా అంతగా ఆడకపోవడంతో తెలుగులో మళ్లీ నటించలేదు. కానీ మాధవన్ లాంటి విలక్షణ నటుడ్ని చూస్తే ఓ సినిమాలో డైలాగ్ గుర్తొస్తుంది.. బంగారపు హుండీని చిల్లర వేయడానికి పెట్టుకున్నారు అని. ప్రస్తుతం అరడజను సినిమాల్తో బిజీగా ఉన్న మాధవన్ తమిళ్ కంటే కూడా హిందీలో బిజీ అవడం విశేషం. మరి తెలుగులో మాధవన్ ని వాడుకునే సరైన దర్శకులు ఆయనతో ఎప్పుడు తీస్తారో.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు