Madhavan : నా త్యాగాన్ని అతిగా ఆదరించకండి

కోలీవుడ్ నటుడు మాధవన్.. పరిచయం అవసరం లేని పేరు. ఒక నటుడు గానే కాకుండా, నిర్మాత, దర్శకుడిగా మాధవన్ పలు సినిమాలు చేశారు. ఇటీవల రాకెట్రి : ది నంబి ఎఫెక్ట్ అనే చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థలో శాస్త్రవేత్తగా పని చేసిన నంబి నారాయణన్ అనే వ్యక్తి జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రానికి కథ, దర్శకత్వం, నిర్మాతగా మాధవన్ వ్యవహరించారు. కాగా గూఢచర్యం కేసులో చాలా సంవత్సరాలు ఆరోపణలు ఎదుర్కొన నంబి నారాయణన్, ఈ కేసులో ఎదుర్కొన్న కష్టాలతో పాటు ఈ కేసు ఎలా ముగిసింది అనే అంశాలను ఈ చిత్రంలో చూపించారు.

ఈ సంవత్సరం జూలై 1న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. రూ. 25 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 50 కోట్లకు పైగా కలెక్షన్లను తెచ్చి పెట్టింది. అయినా, కొన్ని రోజుల నుండి ఒక వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. అదేంటంటే, రాకెట్రీ : ది నంబి ఎఫెక్ట్ వల్ల మాధవన్ కు తీవ్ర నష్టాలు వచ్చాయని, ఈ నష్టాలతో తన ఇల్లును కూడా అమ్ముకున్నారని వార్తలు వచ్చాయి.

తాజాగా ఈ వార్తలపై మాధవన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ”దయచేసి, నా త్యాగాన్ని అతిగా ఆదరించకండి. రాకెట్రీ సినిమా వల్ల నేను ఇల్లు, ఇంకా ఏదీ కోల్పోలేదు. వస్తవానికి రాకెట్రీ చిత్రానికి పని చేసిన వాళ్లు, సహా నిర్మాతలు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ సంవత్సరం భారీగా ఐటీ కూడా చెల్లిస్తారు. దేవుడి దయ వల్ల రాకెట్రీ చిత్రంతో మంచి లాభాలను తెచ్చుకున్నాం. నేను ఇప్పటికీ మా ఇంట్లోనే సంతోషంగా నివసిస్తున్నాను” అంటూ ట్వీట్ చేశారు. మాధవన్ ట్వీట్ తో ఇప్పటి వరకు వచ్చిన వార్తలు అన్ని పుకార్లే అని తెలిసిపోయాయి. అలాగే ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు