Mahesh Babu: కష్టాల్లో గుంటూరు కారం – సంక్రాంతికి రిలీజ్ అవుతుందా…?

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో గుంటూరు కారం సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ విడుదలై సినిమాపై అంచనాలు పెంచింది. ఈ సినిమా చాలా కాలం కిందట మొదలైనప్పటికీ షూటింగ్ పలుమార్లు వాయిదా పడటంతో ఒక్క షెడ్యూల్ కూడా ఇంకా పూర్తి కాలేదు. మహేష్ బాబు వెకేషన్ కి వెళ్లటం వల్ల వాయిదా పడ్డ షూటింగ్ ని త్వరలోనే స్టార్ట్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది సినిమా యూనిట్. జూన్ మొదటి వారంలో హైదరాబాద్ లో వేసిన భారీ సెట్లో షూటింగ్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేసినప్పటికీ మళ్లీ వాయిదా పడింది. ఈ సారి వాయిదా పాడటానికి కారణం మాత్రం మహేష్ బాబు కాదని తెలుస్తోంది.

ఈ సినిమాలో మహేష్ తో పాటు నటిస్తున్న సీనియర్ స్టార్స్ జగపతి బాబు, ప్రకాష్ రాజ్, జయరామ్, వంటి వారు గుంటూరు కారం షూటింగ్ కి గ్యాప్ రావటంతో ఇతర సినిమాల షూటింగ్ కి వెళ్ళటం వల్ల గుంటూరు కారం సినిమాకి డేట్స్ అడ్జస్ట్ అవ్వలేదని తెలుస్తోంది. ఈ కారణంగానే షూటింగ్ జూన్ 12కి వాయిదా వేసినట్లు సమాచారం. అసలే త్రివిక్రమ్ సినిమాలను ఒక పట్టాన పూర్తి చేయడు అన్న టాక్ ఉంది. అలాంటిది ఈ సినిమా షూటింగ్ ఇన్ని సార్లు వాయిదా పడటంతో అనుకున్న సమయానికి రిలీజ్ అబుతుందా లేదా అని మహేష్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

మహేష్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. మహేష్ బాబు ఈ సినిమాలో ఔట్ అండ్ ఔట్ మాస్ లుక్ తో డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ మాడ్యులేషన్ తో కనిపిస్తున్న నేపథ్యంలో సినిమాపై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. త్రివిక్రమ్ మహేష్ ల కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా కావటంతో నార్మల్ ఆడియెన్స్ లో కూడా ఆసక్తి నెలకొంది. మరి, తరచూ ఎదో ఒక కారణంతో వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా అనుకున్న సమయానికి రిలీజ్ అవుతుందా లేదా వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు