Samantha: టర్కీ వెళ్ళింది షూటింగ్ కోసమా? ఎంజాయ్ చేయడానికా..?

లేడీ సూపర్ స్టార్ సమంత, రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఖుషి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం టర్కీలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి ఇటీవల విడుదలైన లిరికల్ సాంగ్ మ్యూజిక్ లవర్స్ ప్లే లిస్ట్ స్థానం సంపాదించుకుంది. విజయ్ సమంతల గత చిత్రాలు శాకుంతలం, లైగర్ డిజాస్టర్ అయిన క్రమంలో ఈ సినిమా హిట్ అవ్వటం ఇద్దరికీ కీలకంగా మారింది. అయితే, ఈ సినిమా షూటింగ్ అప్డేట్స్ కంటే సమంత, విజయ్ లు షేర్ చేస్తున్న పర్సనల్ ఫోటోల వల్ల తరచూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ మారుతున్నారు.

ఇటీవల ఇద్దరు కలిసి రెస్టారెంట్ కి వెళ్లి దిగిన ఫోటో సమంత ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా అది వైరల్ అయ్యింది. అంతే కాకుండా, విజయ్ ని బెస్ట్ ఫ్రెండ్ అన్న అర్థం వచ్చేలా రాసిన క్యాప్షన్ మీద పెద్ద చర్చ జరిగింది. ఇక తాజాగా సమంత జిమ్ కి వెళ్లే సమయంలో టర్కీ వీధుల్లో విహరిస్తూ చిల్ అవుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పబ్లిక్ ఫోన్ దగ్గర నిలబడి ‘కాలింగ్ హోప్’ అనే ట్యాగ్ లైన్ తో సమంత షేర్ చేసిన ఫోటోపై రకరకాల కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.ఆ ఫోటోలో వైట్ హార్ట్ సింబల్ ఉండటం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. మొన్న విజయ్ ని ట్యాగ్ చేస్తూ షేర్ చేసిన పోస్ట్ లో కూడా వైట్ హార్ట్ సింబల్ ఉండటంతో తాజాగా ‘కాలింగ్ హోప్’ అనే క్యాప్షన్ కూడా విజయ్ ని ఉద్దేశించి పెట్టిందని నెటిజన్స్ డిసైడ్ చేసేస్తున్నారు. టర్కీ షూటింగ్ గురించి కాకుండా వీళ్లిద్దరి పర్సనల్ ఫోటోలు ఎక్కువ బయటికి వస్తుండటం వల్ల షూటింగ్ కోసం కాకుండా ఇద్దరు వెకేషన్ కి వెళ్లినట్లుందని కూడా కామెంట్స్ వస్తున్నాయి.

- Advertisement -

గాసిప్స్ మాట పక్కన పెడితే, మయోపియా నుండి ఇటీవలే కోలుకున్న సమంత టర్కీలో కనిపించినంత ఎనర్జిటిక్ గా, ఆనందంగా ఎక్కడా కనిపించలేదు. బెస్ట్ డేస్ అంటూ సమంత విజయ్ తో కలిసి దిగిన ఫోటోకి క్యాప్షన్ ఇవ్వడంపై కూడా రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సమంత ఇప్పటిదాకా సినిమాలు చేసిన ఏ హీరోతో కూడా ఇంత క్లోజ్ గా మూవ్ అవుతూ సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేయలేదు.

దీంతో ఇద్దరి మధ్య ఉన్నది స్నేహమేనా లేక అంతకు మించి ఏమైనా ఉందా అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. మొత్తం మీద ఖుషి సినిమా మేకింగ్ కంటే సమంత, విజయ్ ల మధ్య ఫ్రెండ్షిప్ పై సోషల్ మీడియాలో తరచూ వినిపిస్తున్న గాసిప్స్ వల్ల సినిమాకి హైప్ క్రియేట్ అవుతుంది. సెప్టెంబర్ 1న రిలీజ్ కి సిద్దమవుతున్న ఈ సినిమాపై నెలకొన్న అంచనాలను చేరుకుంటుందా లేదా అన్నది వేచి చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు