7.11PM: స్కైఫై జోనర్ లో మరో చిత్రం. ఆకట్టుకుంటున్న టీజర్

టాలీవుడ్ లో ఈ మధ్య డిఫరెంట్ సినిమాలు రూపొందుతున్నాయి. రిజల్ట్ సంగతి పక్కన పెట్టినా, సరికొత్త జోనర్లో ప్రయోగాలు చేయడంలో తెలుగు దర్శకులు ఎప్పుడూ ముందుంటున్నారు. ముఖ్యంగా తెలుగులో స్పై నేపథ్యంలో, స్కైఫై నేపథ్యంలో చాలా సినిమాలు వస్తున్నాయి. ఈ మధ్యే స్పై నేపథ్యలో అడవి శేష్ గూఢచారి సినిమా చేయగా, ఇప్పుడు దానికి సిక్వెల్ గా గూఢచారి 2 కూడా తెరకెక్కిస్తున్నాడు. ఇక నిఖిల్ కూడా అదే జోనర్ లో “స్పై” అన్న సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక మొన్న వచ్చిన విరూపాక్ష, ఇక ముందు రాబోతున్న సైంధవ్ సినిమాలు ఇలా కొత్త రకం కాన్సెప్ట్ తో వస్తున్నవే.

తాజాగా టాలీవుడ్ లో స్కైఫై నేపథ్యంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. కోకో అన్న పేరుతో ఈ మధ్యనే విడుదలైన టీజర్ బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు లేటెస్ట్ గా టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో ఒక స్కైఫై నేపథ్యంలో మరో సినిమా వస్తుంది. తాజాగా విడుదలైన టీజర్ అందరిని ఆసక్తి రేపుతోంది. సినిమా పేరు “7:11PM” అని పెట్టగా, టైమ్ ట్రావెలింగ్ కాన్సెప్ట్ అని టీజర్ చూడగానే తెలిసిపోయింది. ఇక ఈ సినిమాలో అంతా కొత్త తారాగణం నటించగా నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. గ్రాఫిక్స్ కూడా చాలా బాగుండడంతో టీజర్ చుసిన వారికీ థ్రిల్ ఇస్తుంది. ఈ చిత్రానికి శివ శంకర్, ఫాబియో కాపోడివెంటో సినిమాటోగ్రఫీ అందించగా, ఓం రమేష్ గ్రాఫిక్స్ వర్క్ బాగుంది. ఒకేసారి రెండు టైమ్స్ ప్రకారం ఈ సినిమా కథ సాగుతుంది. ఈ సినిమాకి 7:11 టైమ్ కి ఏంటి సంబంధం అనే విషయాలు సినిమాలోనే రివీల్ చేయనున్నారు.

- Advertisement -

ఇక ఈ సినిమాలో సాహస్ పగడాల హీరోగా నటిస్తుండగా, దీపికా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాను అర్కస్ ఫిల్మ్స్ బ్యానర్ లో నరేన్ యనమదల, మాధురి రావిపాటి, వాణి కన్నెగంటి సంయుక్తంగా నిర్మిస్తుండగా, చైతు మాదాల దర్శకత్వం వహిస్తున్నాడు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు