Mahesh Babu: మరోసారి సంక్రాంతికి మొగుడు వస్తాడు

Guntur Kaaram

టైటిల్ అంటే ఇలా ఉంది అనుకుంటున్నారా.? అదే అండి “సరిలేరు నీకెవ్వరు” సినిమాలో ప్రకాష్ రాజ్ అంటాడు కదా “ప్రతి సంక్రాంతికి అల్లుళ్ళు వస్తారు ఈ సంక్రాంతికి మొగుడు వచ్చాడు” అని. సో ఈసారి కూడా ఎన్ని అడ్డంకులు దాటినా సంక్రాంతికి బాబు ల్యాండ్ అవ్వడం ఖాయం అన్నమాట. మాములు టైం లో సినిమాలు రిలీజ్ అవ్వడం లేరు.అదే సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అవ్వడం వేరు.

ఇక సంక్రాంతికి ప్రస్తుతానికి నాలుగు సినిమాలు సిద్ధంగా ఉన్నాయి.
గుంటూరు కారం రిలీజ్ అవుతుంది అని ఇప్పటికే అధికారకంగా ప్రకటించారు. అలానే రవితేజ ఈగెల్ , పరుశురామ్ దర్శకత్వంలో విజయ్ నటిస్తున్న ఫ్యామిలీ మేన్ , ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా నటిస్తున్న హనుమాన్. ఈ సినిమాలు అన్నింటిమీద మంచి అంచనాలు ఉన్నాయి. కానీ వీటి అన్నింటిని మించిన ఎక్కువ అంచనాలు గుంటూరు కారం సినిమాపై ఉన్నాయి.

ఇదివరకే త్రివిక్రమ్ మహేష్ కాంబినేషన్ లో వచ్చిన అతడు , ఖలేజా సినిమాలు కమర్షియల్ గా కాకపోయినా టీవీ లో ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వీరి కాంబినేషన్ లో సినిమా వస్తుంది అంటే ఆ మాత్రం ఎక్స్పెక్టేషన్స్ ఉండటం కామన్. ఇకపోతే త్రివిక్రమ్ సినిమా గురించి ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం , ఫ్యామిలీ పల్స్ తెలిసిన దర్శకుడు.
సో సినిమాకి ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చిన , సంక్రాంతికి కలక్షన్స్ రావడం ఖాయం. సో మిగతావి మహేష్ కంటే చిన్న హీరోల సినిమాలు కాబట్టి సంక్రాంతికి బాబు మొగుడు అయినట్టే.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు