Bigg Boss Season7: ఈ వీక్ సందీప్ బ్యాటరీ రెడ్ కి పడిపోవటం ఖాయం..!

Bigg Boss Season 7

బిగ్ బాస్ సీజన్ 7లో ఫాస్ట్ హౌస్ మేట్ గా అర్హత సాధించాడు సందీప్. ఫస్ట్ వీక్ లో పాజిటివ్ గా ప్రాజెక్ట్ అయిన సందీప్ ఆ తర్వాత నుండి సేఫ్ గేమ్ స్టార్ట్ చేయటంతో ఆడియెన్స్ లో నెగిటివిటీ కూడా మొదలైంది. ఫస్ట్ పవర్ అస్త్ర విన్ అయిన సందీప్ కి 5వారాల ఇమ్యూనిటీ కూడా వచ్చింది. దీంతో నామినేషన్స్ నుండి తప్పించుకున్నాడు సందీప్.
అయితే, రోజురోజకి సందీప్ సేఫ్ గేమ్ కాస్త, బయాస్డ్ గా మారిపోయింది. స్టార్ట్ మా బ్యాచ్ కి ఫేవర్ గా ఆడటం స్టార్ట్ చేశాడు ఈ కొరియోగ్రాఫర్. అంతే కాకుండా ఒకరి దగ్గర ఒక్కోలాగా బిహేవ్ చేయటం, ఇక్కడి మాటలు అక్కడ మోయటం కూడా స్టార్ట్ చేశాడు సందీప్.
టాస్క్ జరుగుతున్న సమయంలో కంటెస్టెంట్స్ మధ్య గొడవలు స్టార్ట్ అయినప్పుడు సర్ది చెప్పాల్సిన సందీప్, చూస్తూ ఊరకుండటం పట్ల కూడా ఆడియెన్స్ లో నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చేలా చేసింది. సందీప్ పవర్ అస్త్ర వచ్చిందన్న ఫీలింగ్ తో రిలాక్స్ అవ్వకుండా బ్యాటరీలో బార్స్ రెడ్ కలర్ కి పడిపోకుండా చూసుకునే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్.
గత వారంలో సందీప్ పర్ఫామెన్స్ ఆశించిన స్థాయిలో లేకపోవటంతో బ్యాటరీ బార్ ఎల్లో కలర్ కి పడిపోయింది. ఈ వారం కూడా సందీప్ పెరఫామెన్స్ లో ఏ మాత్రం మెరుగుపడకపోవటంతో బ్యాటరీ బార్ రెడ్ కలర్ కి పడిపోవటం ఖాయమని కామెంట్స్ వస్తున్నాయి. మరి, ఈ వారం సందీప్ కి నాగార్జున నుండి ఎలాంటి క్లాస్ ఉంటుందో చూడాలి.
Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు