Bigg Boss Season 7: శివాజీ వర్సెస్ స్టార్ మా బ్యాచ్ – పీక్స్ కి చేరుతున్న వార్..!

Bigg Boss Season 7

బిగ్ బాస్ సీజన్7 ఇటీవలే స్టార్ట్ అయ్యి ఇంట్రస్టింగ్ గా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్లో ఎంటర్టైన్మెంట్ తో పాటు గ్లామర్ కూడా సమానంగా ఉండటంతో మంచి టీఆర్పీ వస్తోంది. ప్రతి సీజన్లోలాగే ఈ సీజన్లో కూడా లవ్ ట్రాక్స్, సేఫ్ గేమ్స్ ఆసక్తి పెంచుతున్నాయి. ఇదిలా ఉండగా హౌస్ లో శివాజీకి స్టార్ మా సీరియల్ బ్యాచ్ అయిన అమర్ డీప్, ప్రియాంక, రతిక, శోభ శెట్టి మధ్య వైరం ఆసక్తిగా మారింది.

వీక్ కంటెస్టెంట్స్ కి సపోర్ట్ ఇస్తానంటూ శివాజీ మొదటి నుండి రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్ లతో క్లోజ్ గా మూవ్ అవుతూ సపోర్ట్ గా ఉంటున్నాడు. హౌస్ లోకి ఎంటరైన స్టార్టింగ్ లోనే శివాజీ ఆ నలుగురిని స్టార్ మా బ్యాచ్ అంటూ బ్రాండ్ వేసి వేరుగా చూడటం స్టార్ట్ చేసాడు.

శివాజీ బ్రాండ్ వేసినట్లుగానే ఈ నలుగురు మొదటి నుండి కలిసిపోయి గేమ్ అడుతన్నారు. హౌస్ లోకి ఎంటరవ్వక ముందే ఈ బ్యాచ్ ఒక ప్లాన్ తో వచ్చారన్నది శివాజీ వాదన. ఎపిసోడ్స్ గడుస్తున్న కొద్దీ కంటెస్టెంట్స్ మధ్య ఉండాల్సిన పోటీ కాస్త శివాజీ వర్సెస్ స్టార్ మా బ్యాచ్ లాగా మారుతున్నట్లు అనిపిస్తోంది.

- Advertisement -

ప్రస్తుతం హౌస్ లో 4వ పవర్ అస్త్ర కోసం పోటీ జరుగుతుండగా కంటెండర్స్ గా ప్రశాంత్, యావర్ లు గెలిచారు. ఆ తర్వాత మూడో కంటెండర్ కోసం బిగ్ బాస్ మరో టాస్క్ పెట్టగా, ఈ టాస్క్ లో ఎవరు నెగ్గుతారన్నది ఆసక్తిగా మారింది. మొత్తానికి స్టార్ మా బ్యాచ్ వర్సెస్ శివాజీగా మారిన ఈ పోటీలో ఎవరు గెలుస్తారో చూడాలి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు