Anushka Shetty Marriage: ఆ హీరో వల్లే అనుష్క పెళ్లి జరగడం లేదా?

Anushka Shetty Marriage

టాలీవుడ్‌లో లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు ఇండస్ట్రీలో దాదాపు అందరు అగ్ర హీరోలతో నటించి, టాప్ హీరోయిన్ గా ఎదిగింది. దీని తర్వాత హీరో సెంట్రిక్ సినిమాలను పక్కన పెట్టి లేడీ ఓరియంటెడ్ సినిమాలపై ఫోకస్ పెట్టింది. ఇప్పుడు ఇండస్ట్రీ ఏదైనా, లేడీ ఓరియంటెడ్ సినిమాలు అంటే… అందరికీ ఇన్సపరేషన్ అనుష్క శెట్టినే.

నిశ్శబ్దం సినిమా తర్వాత మరో సినిమా చేయలేదు. దాదాపు మూడేళ్ల తర్వాత ఆమె మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మంచి విజయాన్ని కూడా సాధించింది. అయితే ఈ బ్యూటీ నాలుగు పదుల వయసు దాటినప్పటికీ పెళ్లి ఊసే ఎత్తడం లేదు.

దీనికి మరోవైపు చూస్తూ… హీరో ప్రభాస్ తో అనుష్క ప్రేమలో ఉందని, త్వరలోనే వారిద్దరి పెళ్లి చేసుకుంటారని వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. రోజులు గడుస్తున్నా… ఈ రూమర్స్ మాత్రం తగ్గడం లేదు. అయితే అనుష్క శెట్టి తెలుగు ఇండస్ట్రీకి వచ్చి 18ఏళ్లు దాటింది. అనుష్క తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన చాలామంది యంగ్ హీరోయిన్స్ పెళ్లిళ్లు చేసుకుని సెటిల్ అయిపోయారు. అయితే 40 ఏళ్ల వయసున్న స్వీటీ మాత్రం ఇంకా వివాహ బంధంలోకి అడుగుపెట్టలేదు.

- Advertisement -

అనుష్క శెట్టి పెళ్లి చేసుకోకుండా ఉండటానికి ఒక హీరో కారణమట. ఒక హీరోతో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టు రూమర్స్ రావడం వల్లే, అనుష్క శెట్టి పెళ్లి అవ్వడం లేదని ఇండస్ట్రీలో టాక్. ఆ హీరో ఎవరో కాదు… కింగ్ నాగార్జున.

నాగార్జున హీరోగా వచ్చిన సూపర్ మూవీలో అనుష్క సెకండ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అప్పటినుంచి వీళ్లిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. అంతేకాదు అప్పట్లో ఆయన అనుష్కతో రిలేషన్ షిప్ లో ఉండడం వల్ల ఆఫర్లు కూడా ఇప్పించాడనే టాక్ వినపడింది. ప్రభాస్‌తో లవ్ ట్రాక్ అంటూ రూమర్స్ వచ్చిన రోజుల్లో కూడా.. ఎక్కడో ఒక చోట నాగార్జునతో రిలేషన్ షిప్ అంటూ వార్తలు వచ్చేవి. అలా.. అనుష్క ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదని వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే, అనుష్క మాత్రం… తనకు నచ్చే వ్యక్తి ఇప్పటి వరకు కనిపించలేదని, అలా ఎవరైనా ఉంటే, వెంటనే పెళ్లి చేసుకుంటానని ఇప్పటికే పలు మార్లు చెప్పిన సంగతి తెలిసిందే.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు