Chandramukhi-2: చంద్రముఖి రీ రిలీజ్ చేసిన వర్కౌట్ అయ్యేది.

Chandramukhi-2

 

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, పి.వాసు దర్శకత్వంలో 2005 లో విడుదలైన సినిమా చంద్రముఖి. ఈ సినిమా 1993 లో మలయాళంలో రిలీజైన “మణిచిత్రతాఝు” అనే సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది. అయితే చంద్రముఖి తెలుగు డబ్బింగ్ సినిమా కూడా పెద్ద హిట్ అయింది. అప్పట్లో ఈ సినిమా ఒక సంచలనం అని చెప్పొచ్చు. రజినీకాంత్ గ్రేస్ , స్టైల్ , వడివేలు కామెడీ , హార్రర్ అన్ని ఈ సినిమాకు పెద్ద ప్లస్ అయి మంచి రిజల్ట్ ను తెచ్చిపెట్టాయి.

ఇప్పటికి ఆ సినిమాను చూస్తున్న మంచి అనుభూతి కలుగుతుంది.
ఆ సినిమాలోని క్యారెక్టర్స్ ఇప్పటికి ఆడియన్స్ కి గుర్తున్నాయి.
చంద్రముఖి , వేంకటపతి రాజును ఇప్పటికి కొంతమంది ఇమిటేట్ చేస్తారు. ఈ సినిమాకి సీక్వెల్ అంటూ అప్పుడు నాగవల్లి అనే సినిమా కూడా రిలీజ్ అయింది. అయితే వెంకటేష్ నటించిన ఆ సినిమా అంతంత మాత్రమే అడిగింది.

- Advertisement -

ఇక రీసెంట్ గా చంద్రముఖి -2 పేరు తో , రాఘవ లారెన్స్ హీరోగా పి.వాసు దర్శకత్వంలో ఒక సినిమా రిలీజ్ అయింది. చంద్రముఖి సినిమాలో ఏవైతే క్యారెక్టర్స్ ఉన్నాయో ఆ చంద్రముఖి , వేంకటపతి రాజు లా స్టోరీ ని ఈ సినిమాలో చూపించాడు. కానీ ఈ సినిమా ఆ సినిమా స్థాయిలో లేదు.
సో కొంతమంది ఈ సినిమా గురించి చర్చిస్తూ. చంద్రముఖి సినిమాను రీ రిలీజ్ చేసిన ఇప్పటికి మంచి రిజల్ట్ వచ్చేది అని కొంతమంది ప్రేక్షకుల అభిప్రాయం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు