Devisri Prasad: ఎట్టకేలకు పెళ్లి పీటలెక్కనున్న దేవిశ్రీ ప్రసాద్.. !

టాలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ పెళ్లి చేసుకోబోతున్నాడంటూ సోషల్ మీడియాలో ఓ వార్త హల్చల్ చేస్తోంది. వివరాల్లోకి వెళితే, తన ఫ్యామిలీ సర్కిల్లోనే వరుసకు మరదలు అయ్యే అమ్మాయితో దేవి వివాహం జరగనుందని ఆ వార్త సారాంశం. దేవిశ్రీ ప్రసాద్ ఎప్పటి నుండో పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఏ కారణం చేతనో అవి ఓ కొలిక్కి రాలేదు. గతంలో ఓ హీరోయిన్ తో దేవి ప్రేమాయణం నడుపుతున్నాడంటూ రూమర్స్ వచ్చినప్పటికీ అవి రూమర్స్ గానే మిగిలాయి. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న కథనం ప్రకారం దేవికి, తాను పెళ్లి చేసుకుబోయే అమ్మాయికి మధ్య 17ఏళ్ల గ్యాప్ ఉందన్న వార్త ఇంట్రస్టింగ్ గా మారింది.

చిన్న వయసులోనే దేవి సినిమా ద్వారా మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన డీఎస్పీ ఆ తరువాత వెనుదిరగకుండా వరుస హిట్స్ అందుకుంటూ ఆనతి కాలంలోనే స్టార్ హీరోలందరికీ మ్యూజికల్ హిట్స్ ఇస్తూ, పెద్ద సినిమా అంటే కచ్చితంగా దేవి మ్యూజిక్ ఉండాల్సిందే అన్న రేంజ్ కి ఎదిగాడు. అయితే ఈ మధ్య కాలంలో రంగస్థలం, పుష్ప, ఉప్పెన, వాల్తేరు వీరయ్య లాంటి అడపాదడపా హిట్స్ తప్ప దేవికి చెప్పుకోదగ్గ హిట్స్ పడలేదు. బహుశా 40ఏళ్ళు పైబడిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కి ఇప్పుడు పెళ్లి ఆలోచన కలగడానికి ఈ మధ్య కాలంలో సరైన హిట్స్ లేకపోవడం కూడా ఒక కారణం అనిపిస్తుంది.

దేవిశ్రీ ప్రసాద్ నుండి కానీ, ఆయన కుటుంబం నుండి కానీ, దేవి పెళ్లి గురించి ఎలాంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ నిప్పు లేనిదే పొగ రాదు అన్న చందాన ఈ వార్తల్లో ఎంతో కొంత నిజం ఉండకపోదు. ఒకవేళ ఇదే గనక నిజం అయితే టాలీవుడ్ జరగబోయే మరొక సెలెబ్రిటీ గ్రాండ్ వెడ్డింగ్ ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ దే అవుతుంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు