December: అన్ సీజన్ కాస్తా.. సినిమా సీజన్ అయిపొయింది…!

టాలీవుడ్ లో సినిమాల సీజన్ అంటే ‘సంక్రాంతి’ మరియు ‘దసరా’ అంటూ ఉంటారు సినీ ప్రియులు. ఈ రెండు కాకపోతే సమ్మర్ అంటారు. ఈ సీజన్ల లో చిన్న హీరోల మొదలు కొని పెద్ద హీరోల సినిమాల దాకా భారీ సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇక ఆ తర్వాత ఫెస్టివల్ సీజన్ల ను చూసుకుని వినాయక చవితి, ఆగష్టు 15, దీపావళి అంటూ ఒక్కో నెలలో రిలీజ్ కొన్ని సినిమాలను రిలీజ్ చేస్తారు.

అయితే టాలీవుడ్ లో డిసెంబర్ నెలలో మాత్రం సినిమాలు రిలీజ్ చేయడానికి జంకుతూ ఉంటారు నిర్మాతలు. ముఖ్యంగా పెద్ద సినిమాల నిర్మాతలు డిసెంబర్ లో తమ సినిమాలను రిలీజ్ చేయడానికి అస్సలు ఇష్టపడరు. ఎందుకంటే డిసెంబర్ లో రిలీజ్ అయ్యే సినిమాలు పెద్దగా ఆడవని, జనాలు ఎక్కువగా పట్టించుకోరని, అన్నిటికి మించి లాంగ్ రన్ స్కోప్ అస్సలు ఉండదని అనుకుంటారు. ఎందుకంటే డిసెంబర్ పూర్తవగానే సంక్రాంతి మొదలవుతుంది కాబట్టి సినిమాలని థియేటర్లలోంచి తీసేస్తారు. మహా అయితే డిసెంబర్ మొదటి వారంలో రిలీజ్ చేస్తారు.

అయితే లాక్ డౌన్ తర్వాత మాత్రం పరిస్థితి మారింది. టాలీవుడ్ లో ఏ సినిమా పడితే ఆ సినిమా జనాలు చూడడం మానేశారు. పైగా రేట్లు ఎక్కువయ్యాయి కాబట్టి థియేటర్లలో మంచి సినిమా వస్తేనే ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. ఈ విషయాలు ఎంత నిజమో కంటెంట్ ఉన్న సినిమాలు ఎప్పుడొచ్చినా జనాలు ఆదరిస్తారన్నది కూడా అంతే నిజమని మేకర్స్ చెప్తున్నారు.

- Advertisement -

దానికి ఉదాహరణగా కొన్నేళ్లుగా డిసెంబర్ లో రిలీజ్ అవుతున్న సినిమాల గురించే చెప్పొచ్చు. అప్పట్లో డిసెంబర్ 9న 2016 లో రామ్ చరణ్ ధ్రువ సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ తర్వాత మళ్ళీ డిసెంబర్ లో సరైన సినిమా రాలేదు. కానీ లాక్ డౌన్ పూర్తైన తర్వాత 2020 లో ఫస్ట్ థియేటర్లలో రిలీజ్ అయిన సినిమా ‘సోలో బ్రతుకే సో బెటర్’. ఈ సినిమా డిసెంబర్ 25 న రిలీజ్ అయ్యి హిట్ అయింది.

ఇక ఆ తర్వాత 2021 డిసెంబర్ లో అఖండ, పుష్ప సినిమాలు రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ఆ తర్వాత 2022 లో హిట్ 2, ధమాకా సినిమాలు కూడా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఇక లేటెస్ట్ 2023 డిసెంబర్ లో హాయ్ నాన్న, అనిమల్, సలార్ మంచి హిట్ అయ్యాయి. ఇక నుండి కంటెంట్ ఉన్న ప్రతి సినిమాని డిసెంబర్ లో రిలీజ్ చేసుకోవచ్చన్న ధైర్యాన్ని ఈ సినిమాలు ఇచ్చాయని చెప్పొచ్చు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు