Salaar : ప్లాప్ అయ్యుంటే ఈ సీన్ పై ట్రోలింగ్ ఓ రేంజ్ లో జరిగేది?

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘సలార్’ మూవీ డిసెంబర్ 22న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యి థియేటర్లలో భారీ కలెక్షన్లు రాబడుతుంది. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కన్నడ నటుడు పృత్వి రాజ్ సుకుమారం సెకండ్ లీడ్ గా నటించగా, శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. అయితే సలార్ మూవీ రిలీజ్ రిలీజ్ అయ్యాక కెజిఎఫ్ రేంజ్ లో టాక్ తెచ్చుకోకపోయినా, ఉన్నంత లో డీసెంట్ అన్న టాక్ తెచ్చుకుంది. అయితే ప్రభాస్ నుండి చాలా ఏళ్ళ తర్వాత ఒక మాస్ సినిమా రావడంతో థియేటర్ల వద్ద భారీ ఓపెనింగ్స్ రాబట్టగా, ఇప్పటికే 500 కోట్ల క్లబ్ లో చేరిన ఈ సినిమా 600 కోట్ల దిశగా దూసుకుపోతుంది.

అయితే ఈ సినిమాకు లాంగ్ రన్ ఆడేంత అవకాశం లేదని ప్రస్తుతం వర్కింగ్ డేస్ లో వస్తున్న కలెక్షన్లను బట్టి అనిపిస్తుంది. అయితే రెండో వీకెండ్ లో సలార్ పుంజుకుంటే బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే సలార్ వైలెన్స్ ఎక్కువగా ఉందని సెన్సార్ సభ్యులు ‘ఏ’ సర్టిఫికెట్ ఇచ్చారన్న సంగతి తెలిసిందే. అందువల్ల 18 ఏళ్ళ లోపు వ్యక్తులకు ఈ సినిమా చూడ్డానికి అనుమతి ఇవ్వడం లేదు.

ఇదిలా ఉండగా సలార్ మూవీ లో ఓ సీన్ పై సోషల్ మీడియా లో ట్రోలింగ్ మొదలైంది. అది ఏ సీన్ అయ్యుంటుందో పెద్దగా చెప్పనక్కర్లేదు. అవును.. మీరనుకున్నదే.. సలార్ సెకండాఫ్ లో విలన్లని చంపడానికి ప్రభాస్ వెళ్తుంటే అక్కడ ఉన్న మహిళలు, పిల్లలతో కలిసి ఎలివేట్ చేసే సీన్. ఆ సీన్ లో ఆడవాళ్ళందరూ యా.యా.యా… అంటూ హీరోను మోటివేట్ చేస్తారు. అక్కడింకే మాటలు వినబడవ్. అలా ఆ సీన్ లో ప్రభాస్ విలన్ల ను నరుకుతాడు.

- Advertisement -

అయితే ఈ ఆక్షన్ సీన్ ప్రోమో తాజాగా యుట్యూబ్ లో మేకర్స్ రిలీజ్ చేయగా, సోషల్ మీడియా అప్పుడే ట్రెండ్ అవుతుంది. ఎవరికీ వారు మేమెర్స్ వాళ్లకి నచ్చినట్టు ఎడిట్ చేస్తూ ఈ సీన్ ని ట్రోల్ చేస్తున్నారు. అయితే హిట్ అయిన మూవీ కి ఎన్ని ట్రోల్ చేసినా జనాలు పెద్దగా పట్టించుకోరు. ఉదాహరణకి బోయపాటి సినిమాలే తీసుకోండి.. మూవీ హిట్ అయితే జనాలు పెద్దగా పట్టించుకోరు. కానీ ప్లాప్ అయిందంటే ఆ సినిమాలో సెకను సీన్ కూడా వదలకుండా దారుణంగా ట్రోల్ చేస్తారు. ఆ ట్రోలింగ్ లోనే కదా బోయపాటి డూప్ గా నటించాడని తెలిసింది.

ఇక అలాగే సలార్ ఈ సీన్ బాగున్నా, ఆ సీన్ లో బీజీఎమ్ లో పాట పెట్టి ఉంటే బాగుండేదని ట్రేడ్ పండితుల అభిప్రాయం. ఒకవేళ ఈ సినిమా ప్లాప్ అయ్యి ఉంటే ఈ సీన్ ఎంత ట్రోల్ అయ్యేదో అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు