Naga chaithanya: నాగచైతన్యకు ఆ అలవాటు.. అందుకే సమంత వదిలి వెళ్ళిపోయిందా..?

Naga chaithanya: టాలీవుడ్ హీరో నాగచైతన్య గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అక్కినేని నటవారసత్వం అనే ట్యాగ్ లైన్ ఉన్నా.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు చైతన్య. కేవలం హీరోయిజానికి ప్రాధాన్యత ఉన్న పాత్రలే కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలలో నటిస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇక సమంతతో విడాకుల అనంతరం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. కానీ సినిమాలు మాత్రం అనుకున్న స్థాయిలో సక్సెస్ ని సాధించలేకపోతున్నాయి.

కేవలం సినిమాలే కాకుండా వెబ్ సిరీస్ లతో కూడా ఇప్పుడు ప్రేక్షకులకు మరింత చేరువవుతున్నారు నాగ చైతన్య. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం కర్ణాటకలో తండేల్ మూవీ షూటింగ్ లో ఉన్న నాగచైతన్య ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేస్తూనే.. తన పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకున్నారు. ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. తన ఫేవరెట్ ఫుడ్ గురించి బయటపెట్టారు. నిజానికి నాగచైతన్య మంచి ఫుడీ. అదే సమయంలో ఆయన ఫిట్నెస్ కూడా బాగా మెయింటైన్ చేస్తూ ఉంటారు.

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. “అందరూ అనుకున్నట్టు ఏ న్యూడిల్స్, పిజ్జానో, బర్గర్ నాకు ఇష్టం కాదు. నాకు అచ్చ తెలుగు వంటకాలు.. వైట్ రైస్, ముద్దపప్పులో నెయ్యి వేసుకుని, ఆవకాయ పచ్చడి పెట్టుకుని తినడం అంటే చాలా ఇష్టం. అంతేకాదు ఆ కాంబినేషన్ లో పచ్చి పులుసు కలుపుకొని తింటే ఉంటుంది.. ” అంటూ మాట్లాడారు. ఇక వాటికి సైడ్ డిష్ గా మటన్ గాని, రొయ్యల ఫ్రై కానీ తింటుంటే జీవితానికి ఇంకేం కావాలంటూ చెప్పడం గమనార్హం. దీంతో నాగచైతన్య కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు