Daggupati Raja: ‘స్కంద’లో నటించిన ఈ నటుడి బ్యాక్ గ్రౌండ్ తెలుసా?

Daggupati Raja:

టాలీవుడ్ లో చాలా మంది హీరోలు ప్రతి సంవత్సరం పరిచయమవుతూ ఉంటారు. అందులో కొందరు స్టార్స్ అయితే, మరి కొందరు పెద్దగా గుర్తింపు పొందలేకపోతారు. ఇంకొందరు బిగినింగ్ లో హవా చూపించి తర్వాత నిలబడలేకపోతారు. అలాంటి వాళ్లలో దగ్గుపాటి రాజా కూడా ఒకరు. ఒకప్పుడు తమిళ్, ఇంకా తెలుగులో మంచి లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న ఈ హీరో, 90స్ లో ఎన్నో మంచి చిత్రాల్లో, ముఖ్యంగా తమిళ్ లో ఫస్ట్ సినిమాకే ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్న హీరో అతను. ఆ కొన్నేళ్లపాటు పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించిన రాజా సడన్ గా సినిమాలు ఆపేసి దాదాపు పాతికేళ్ళు ఇండస్ట్రీ కి దూరమయ్యారు.

తమిళ్ లోనే ఎక్కువ ఫేమ్ సంపాదించిన ఈ హీరో టాలీవుడ్ లో పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉన్న వ్యక్తి. టాలీవుడ్ మూవీమొఘల్ డి. రామానాయుడు అన్న కొడుకే ఈ దగ్గుపాటి రాజా. నిజానికి రాజా అసలు పేరు “దగ్గుపాటి వెంకటేష్”. అప్పటికే అన్న వెంకటేష్ అదే పేరుతో తెలుగులో సెటిల్ అవడం వల్ల రాజాని ఈ పేరు పెట్టుకోమని డైరెక్టర్ బాల చందర్ చెప్పడం జరిగింది. ఇక తమిళ్ లో అప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకున్న రాజా చెన్నై లోని సెటిల్ అయ్యాడు. కానీ రామానాయుడు కుటుంబం మొత్తం హైదరాబాద్ వచ్చేసింది. అలా దగ్గుపాటి ఫ్యామిలి కి రాజాకి గ్యాప్ పెరిగింది. కానీ ఫ్యామిలీ ఈవెంట్లలో అప్పుడప్పుడూ కనిపిస్తూ ఉంటాడు.

ఇక 90స్ తర్వాత తమిళ్ లో కొత్త హీరోల ఎంట్రీ తో రాజా హవా తగ్గిపోగా, పూర్తిగా సినిమాలకు దూరమయ్యాడు. రీసెంట్ గా తెలుగులో ఎన్టీఆర్ బయోపిక్ లో ఆయన తమ్ముడిగా నటించినా, పెద్ద రోల్ ఏమి కాదు. ఇప్పుడు తెలుగు స్ట్రెయిట్ సినిమా స్కంద లో రామ్ ఫాదర్ గా కీలక పాత్రలో నటించాడు దగ్గుపాటి రాజా. తాజాగా స్కంద ఈవెంట్ లో కూడా పాల్గొన్న ఆయన, దాదాపు 20ఏళ్ళ తర్వాత తాను నటించిన ఫుల్ లెంగ్త్ సినిమా ఇదేనని దగ్గుపాటి రాజా చెప్పాడు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updatesGossips, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు