Gunturu karam : మహేష్ బాబు కొత్త కార్ రేట్ ఎంతో తెలిస్తే సృహ తప్పి పడిపోతారు.

ఎప్పుడు సింపుల్ గా, డౌన్ టూ ఎర్త్ ఉండే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ కి కార్స్ అంటే ఎక్కువగా ఇష్టమని చాలా మందికి తెలీదు. కానీ ఆయనతో సన్నిహితంగా ఉండేవారికీ మాత్రంమే ఈ విషయం గురించి తెలుసు.

నిజానికి మహేష్ కి కార్స్ మరియు లగ్జారిగా ఉండే భవనాలన్న చాలా ఇష్టం. అందుకే మహేష్ ఆయన సంపాదనలో ఎక్కువగా వీటిపైనే ఖర్చు చేస్తాడు. ఇటీవలనే మహేష్ దుబాయ్ లో ఒక విల్లా కొన్న విషయం ఇంటర్నెట్ లో వైరల్ కాగా, ప్రస్తుతం ఆయన కొన్నకొత్త కార్ న్యూస్ కూడా అదేవిధంగా వైరల్ అవుతుంది.

మార్కెట్ లోకి వచ్చిన ఏ కొత్త కార్ వచ్చిన దాన్ని ట్రై చేయకుండా ఉండని మహేష్ దగ్గర ఇప్పటికే చాలా కార్స్ ఉండగా లేటెస్ట్ గా మహేష్ మరో కార్ ని తీసుకున్నట్టు తెల్సుతోంది. ఇక కార్ విషయానికొస్తే ఎస్వీ సిరీస్ గోల్డ్ కలర్ రేంజ్ రోవర్ కార్ అని తెలుస్తోంది.అయితే దీని రేటు అక్షరాలా 5.4 కోట్లట. మరీ ఇంత ఖర్చు చేసి కొన్నఈ కారు మహేష్ రెగ్యులర్ వాడతాడా అంటే అది కూడా లేదు. కేవలం ఫ్యామిలితో ఔటింగ్ వెళ్ళినపుడు మాత్రమే మహేష్ ఈ కార్స్ ని వాడుతారట. మరీ ఆ మాత్రం దానికి ఇంత కాస్ట్లీ కార్ ఎందుకని కొంతమంది కామెంట్ చేస్తుంటే మరి కొంత మంది మాత్రం తమ అభిమాన హీరో కొత్త కార్ కొనడంతో కంగ్రాట్స్ చెబుతున్నారు.

- Advertisement -

దాదాపు స్టార్ హీరోలందరి దగ్గర రేంజ్ రోవర్ కార్లు ఉన్న కూడా గోల్డ్ కలర్ రేంజ్ రోవర్ కార్ మాత్రం ఒక్క మహేష్ దగ్గరే ఉన్నట్టు స్పష్టమవుతోంది.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు