Prabhas: ‘సలార్’ ఫస్ట్ టికెట్ ఎంతకు అమ్ముడు పోయిందో తెలుసా?

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన “సలార్” సినిమా రిలీజ్ డేట్ దగ్గరికొస్తున్న కొద్దీ ఆడియన్స్ లో అభిమానుల్లో ఆత్రుత పెరిగిపోతుంది. కొంతమంది సినిమా ప్రమోషన్ల విషయంలో మేకర్స్ యాక్టీవ్ గా లేరని అంటున్నా, ఎవరి క్లారిటీ వాళ్ళకుందన్నట్టు, మేకర్స్ వాళ్ళ స్టైల్ లో మెల్లిగా స్టార్ట్ చేసారు. ఇప్పటికే ప్రభాస్ సహా మూవీ యూనిట్ పలు ఇంటర్వ్యూ లు కూడా షూట్ చేసారు. అయితే ఓ సందర్భంలో ప్రశాంత్ నీల్ కంటెంట్ బాగున్నప్పుడు ప్రమోషన్స్ విషయంలో భయపడాల్సిన పనిలేదని నిర్మాతలకు చెప్పాడట.

ఇదిలా ఉండగా నిన్నటి నుండే సలార్ ప్రమోషన్లు స్టార్ట్ అయ్యాయని చెప్పొచ్చు. ఇక ఆ ప్రమోషన్ లో భాగంగా సలార్ మూవీ యొక్క మొట్ట మొదటి టికెట్ ని మేకర్స్ విక్రయించడం జరిగింది. అయితే ఆ ఫస్ట్ టికెట్ ని భారీ మొత్తంలో చెల్లించి కొనుగోలు చేయడం జరిగింది. ఇంతకీ ఆ టికెట్ ఇంతకు అమ్ముడు పోయిందో తెలుసా? దాదాపు 10,116 రూపాయలు. ఆ టికెట్ కొనుకున్న వ్యక్తి మరెవరో కాదు దర్శక ధీరుడు ఎస్ఎస్. రాజమౌళి.

తాజాగా సలార్ ఇంటర్వ్యూ ప్రోగ్రాం జరగగా ఆ ఇంటర్వ్యూ కూడా రాజమౌళి ఆధ్వర్యంలో జరిగింది. ఇక సలార్ నైజాం రైట్స్ కొనుక్కున్న మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత నవీన్ యెర్నేని ఆ టికెట్ ని రాజమౌళి కి అందచేయడం జరిగింది. అయితే రాజమౌళియే సలార్ టీమ్ తో ఇంటర్వ్యూ చేశాడా? లేక ఆ ఇంటర్వ్యూ లో రాజమౌళి కేవలం పాల్గొనడం మాత్రమే జరిగిందా అన్నది తెలియదు. ఇక సలార్ బుకింగ్స్ ఈరోజు సాయంత్రం నుండి తెలుగు రాష్ట్రాల్లో ఆన్లైన్స్ లో అందుబాటులోకి రానున్నాయి.

- Advertisement -

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు