Trivikram: యంగ్ బ్యూటీ ప్రేమలో త్రివిక్రమ్..అందుకే ఇలా..!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తాజాగా ఈయన మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమా చేస్తున్నారు. ఇకపోతే త్రివిక్రమ్ తో సినిమా అంటే ఆయన సినిమాలలో హీరో ఎవరు అన్న విషయం పెద్దగా అవసరం లేదు. ముఖ్యంగా ఆయన సినిమాలలో ఆయన రాసిన కథ, మాటలే హీరోలు.. అందుకే ఆయనకి కూడా హీరోతో సమానంగా క్రేజ్ లభిస్తుంది.. ఇదిలా ఉండగా తాజాగా ఒక టాలీవుడ్ నటి త్రివిక్రమ్ కి ప్రపోజ్ చేయగా ఆయన అంగీకరించారట.

ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా తెలియజేయడంతో ప్రస్తుతం ఈ విషయం కాస్త చాలా వైరల్ గా మారుతోంది. ఇంతకు ఎవరు ఆ నటి ? అనే విషయానికొస్తే.. బుల్లితెరపై యాంకర్ గా కనిపిస్తూ… వెండితెరపై పలు సినిమాలలో ముఖ్యపాత్రలు చేస్తున్న భాను శ్రీ. వాస్తవానికి భాను శ్రీ కి త్రివిక్రమ్ అంటే పిచ్చి ప్రేమట. ఆయనని ఒక్కసారి అయినా కలవాలని ఎన్నోసార్లు అనుకుందట. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ ఒక యాడ్ షూట్ చేయగా.. ఆ యాడ్ లో భానుశ్రీకి అవకాశం ఇచ్చారు.

అంతేకాదు ఆమె ఈ యాడ్ ని కేవలం త్రివిక్రమ్ కోసమే ఓకే చేసినట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తే త్రివిక్రమ్ అంటే భాను శ్రీ కి ఎంత ఇష్టం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ యాడ్ షూటింగ్ సమయంలో త్రివిక్రమ్ కి భాను శ్రీ ఐ లవ్ యు అంటూ ప్రపోజ్ చేశారట. దానికి ఆయన కూడా ఐ లవ్ యు టూ అని బదులిచ్చారట .ఇక తర్వాత ఆయనతో కలిసి దిగిన ఒక ఫోటోని కూడా ఆమె షేర్ చేసుకున్నారు.

- Advertisement -

ఈ ఫోటో గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ప్రశ్నించగా.. భాను శ్రీ తన లవ్ స్టోరీ తెలిపారు. అలాగే తాను రాజమౌళి వంటి పెద్ద దర్శకులతో కూడా పనిచేసినట్లు.. కానీ ఎవరితో కూడా ఫోటో దిగలేదు అయితే త్రివిక్రమ్ తోనే ఫోటో దిగాను అంటూ ఆయనపై తనకి ఉన్న ప్రేమను చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. మొత్తానికి అయితే భాను శ్రీ చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు