AmazonPrime: టాప్ ప్లేస్ లో కుమ్ముతున్న ‘దూత’..!

అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన వెబ్ సిరీస్ “దూత” సోషల్ మీడియా లో కుమ్ముతుంది. ప్రముఖ డైరెక్టర్ విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ ని డిసెంబర్ 1న పాన్ ఇండియా భాషల్లో ప్రముఖ ఓటిటి ప్లాట్ అయిన అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేయగా రిలీజ్ అయిన ఫస్ట్ డే నుండే మంచి రెస్పాన్స్ తెచ్చుకుని సాలిడ్ వ్యూయర్ షిప్ తో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది.

అయితే దూత వెబ్ సిరీస్ కథ ప్రకారం నార్మలే అయినా దాన్ని విక్రమ్ కుమార్ తనదైన స్టైల్ లో ఇంట్రెస్టింగ్ గా మలిచాడు. కొన్ని సందర్భాల్లో తన గత చిత్రమైన 13B ని తలపిస్తుంది. ఇక ప్లాపుల్లో ఉన్న నాగ చైతన్య కు దూత మంచి ఊపునిచ్చింది. ఇక ఈ సిరీస్ రిలీజ్ అయ్యి దాదాపు రెండు వారాలు అయిపోగా దాదాపు 240 దేశాల్లో ఈ సిరీస్ ను ఆడియన్స్ ఎగబడి చూశారు. ఇండియా వరకే చూసుకున్నా కూడా 2 వారాలుగా అమెజాన్ ప్రైమ్ లో దూత సిరీస్ టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవుతూ దుమ్ము లేపుతుంది.

ఈ సిరీస్ చూసిన అక్కినేని అభిమానులు వెబ్ సిరీస్ చాలా బాగుందని ఒకరకంగా చాలా హ్యాపీగా ఉన్నా మరో వైపు కాస్త ఫీలయ్యారు. ఎందుకంటే ఇదే వెబ్ సిరీస్ ని సినిమాగా రెడీ చేసి థియేటర్లలో రిలీజ్ చేసి ఉంటే నాగ చైతన్య కి మంచి బ్లాక్ బస్టర్ పడి ఉండేది అని చై ఫ్యాన్స్ అభిప్రాయపడ్డారు. ఏది ఏమైనా సలార్ రిలీజ్ అయ్యే వరకూ దూత సోషల్ మీడియా లో ట్రెండింగ్ లో కొనసాగడం ఖాయమని చెప్పొచ్చు.

- Advertisement -

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు