Prabhas: బెస్ట్ డైరెక్టర్ ప్రశాంత్ నీలా… మరి రాజమౌళి ఎవరు ప్రభాస్?

వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ “సలార్” మూవీతో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రెడీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ “సలార్” మూవీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ను ఆకాశానికెత్తేస్తూ చేసిన కామెంట్స్ కొంతమంది మనోభావాలను దెబ్బతీసాయి? రాజమౌళిని తక్కువ చేసి మాట్లాడాడు అంటూ ప్రభాస్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. ఇంతకీ ఏం జరిగిందంటే…

ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “సలార్” డిసెంబర్ 22న థియేటర్లలోకి రాబోతోంది. ప్రభాస్ ఈ సినిమాలో హీరోగా నటించిన విషయం తెలిసిందే. అయితే ప్రభాస్ ఇప్పటికి ఈ సినిమా ప్రమోషన్స్, మీడియా ఇంటరాక్షన్ వంటి వాటికి దూరంగానే ఉన్నాడు. కానీ తాజాగా వారం రోజుల్లో “సలార్” ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రభాస్ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కేజిఎఫ్ డైరెక్టర్ గురించి ప్రభాస్ మాట్లాడుతూ తన 21 ఏళ్ల సినీ కెరీర్ లో ప్రశాంత్ బెస్ట్ డైరెక్టర్ అంటూ ప్రభాస్ కామెంట్ చేశాడు. షూటింగ్ ప్రారంభమైన ఒక నెల తర్వాత తామిద్దరం క్లోజ్ అయ్యామని, ప్రశాంత్ హీరో డైరెక్టర్… ఆయన నన్ను షూటింగ్ కు ఎప్పుడు పిలుస్తాడు అని చాలా ఆసక్తిగా ఎదురు చూసేవాడిని. సెట్ కి వెళ్లడం లేదా షూటింగ్ చేయడం కంటే ప్రశాంత్ తో సమయం గడపాలి అని అనిపించేది అంటూ ప్రభాస్ చేసిన కామెంట్స్ కొందరికి నచ్చడం లేదు. దీంతో ఆ కోపాన్ని ప్రభాస్ పై ప్రదర్శిస్తూ మరి రాజమౌళి ఎవరు ప్రభాస్? అని ప్రశ్నిస్తున్నారు.

నిజానికి ప్రభాస్ కు ఇప్పుడున్న ఫాలోయింగ్ కానీ, స్టార్ స్టేటస్ కానీ రావడానికి ముఖ్య కారణం రాజమౌళి. “బాహుబలి” లేకపోతే ఈరోజు ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ కాదు. ఎక్కడి నుంచి వచ్చాము? అసలు రాజమౌళి తనకు ఎలా కెరీర్ ఇచ్చాడు అనే విషయాన్ని మరిచిపోకూడదు అని, కేవలం “సలార్” మూవీలో కలిసి పని చేసినందుకు రాజమౌళి కంటే నీల్ బెస్ట్ డైరెక్టర్ అంటూ క్రెడిట్ చేయడం సరి కాదని చెప్పుకొస్తున్నారు. కొంతమంది ప్రభాస్ అభిమానులు కూడా ఆయన చేసిన ఈ తాజా కామెంట్స్ చూసి షాక్ అవుతున్నారు. కానీ మరి కొంతమంది మాత్రం ప్రభాస్ ను వెనకేసుకొస్తున్నారు. తమ హీరోకు తన సొంత అభిప్రాయాలు, అభిరుచులు ఉంటాయని, ఎవరైనా సరే వాటిని గౌరవించాలని ప్రభాస్ ను సమర్థిస్తున్నారు. అయితే అసలు ప్రభాస్ ఆ కామెంట్స్ చేయడానికి ముందు వెనక ఏముంది అనే విషయం తెలియాల్సి ఉంది. అసలు విషయం ఏంటో తెలుసుకోకుండానే సోషల్ మీడియాలో ప్రభాస్ దిగ్గజ దర్శకుడు రాజమౌళి స్థాయిని ప్రశాంత్ నీల్ తో పోలుస్తూ ఉద్దేశపూర్వకంగా తగ్గించాడని కొట్టుకు చస్తున్నారు. ఒకవేళ అదే నిజమైతే “సలార్” ప్రమోషన్ ఇంటర్వ్యూ కోసం ప్రభాస్ ను, ప్రశాంత్ ను ఇంటర్వ్యూ చేయడానికి రాజమౌళి ఎందుకు రెడీ అవుతాడు?

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు