Salaar : డైనోసార్ బతికుండగానే “డెవిల్”ను తినేస్తుందా?

ప్రస్తుతం ఎక్కడ చూసినా “సలార్” ఫీవర్ కనిపిస్తోంది. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ థియేటర్లలోకి రావడానికి ఇంకా కేవలం ఆరు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు పోటీగా వస్తున్న ఇతర సినిమాలు, అలాగే “సలార్” మూవీ రిలీజ్ అయ్యాక రాబోతున్న సినిమాలపై ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది? అనే విషయం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా ఇదే నెలలో “సలార్” తర్వాత రిలీజ్ కాబోతున్న “డెవిల్” మూవీపై అందరి దృష్టి పడింది.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హై వోల్టేజ్ యాక్షన్ “సలార్”. కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. శృతిహాసన్ హీరోయిన్ గా, మలయాళం సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ మూవీ డిసెంబర్ 22న రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎప్పటినుంచో ఆవురావురుమంటూ ఎదురు చూస్తున్నారు. ఈ డైనోసార్ థియేటర్లలోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందా, ఎప్పుడు బాక్స్ ఆఫీస్ లో బద్దలు కొడదామా అన్నట్టుగా ఉంది సలాం మూవీపై ప్రేక్షకులకు ఉన్న ఆకలి. ప్రమోషన్ విషయాలు మేకర్స్ నెమ్మదిగా ఉన్నప్పటికీ అంచనాలు మాత్రం ఆకాశాన్ని తాగుతున్నాయి. ఇక ఈ మూవీకి ఉన్న హైప్ ని చూసి ఇతర మూవీ మేకర్స్ తమ సినిమాలను “సలార్” మూవీ దరిదాపుల్లో రిలీజ్ చేయడానికి కూడా భయపడుతున్నారు. అయినప్పటికీ నందమూరి హీరో కళ్యాణ్ రామ్ “సలార్” మూవీ రిలీజ్ అయిన వారం రోజుల తర్వాత థియేటర్లలోకి రావడానికి ధైర్యం చేశాడు. ఇక ఇదంతా చూసిన సినీ విశ్లేషకులు డైనోసార్ ఈ డెవిల్ ను బతికుండగానే మింగేస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

కళ్యాణ్ రామ్ హీరోగా, సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ స్పై థ్రిల్లర్ “డెవిల్”. ఏ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అనే సబ్ టైటిల్ తో వస్తున్న ఈ డార్క్ మిస్టరీ మూవీ డిసెంబర్ 29న రిలీజ్ కాబోతోంది. కళ్యాణ్ రామ్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ఇదే కాగా, అన్ని ప్రధాన భాషలో “డెవిల్” మూవీని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే డిసెంబర్ 22న “సలార్” మూవీ సందడి చేయబోతోంది. ఈ మూవీకి ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా ఆ సునామి మామూలుగా ఉండదు. మరి “సలార్” సృష్టించబోయే సంచలనాన్ని డెవిల్ మేకర్స్ ఎలా తట్టుకుంటారు ఇప్పుడు ప్రశ్న. నిజానికి “సలార్” వంటి కమర్షియల్ హై యాక్షన్ సినిమా బ్లాక్ బస్టర్ ట్రాక్ వస్తే కనీసం నాలుగు వారాలు అయినా ఆ స్పీడ్ తగ్గదు అని చెప్పాలి.

- Advertisement -

మరి “సలార్” క్రియేట్ చేయబోయే ఉప్పెనలో “డెవిల్” కొట్టుకుపోతుందా? ఒకవేళ కంటెంట్ బాగున్నప్పటికీ రిలీజ్ డేట్ కరెక్ట్ గా లేకపోతే ఆ ఎఫెక్ట్ మూవీపై తప్పకుండా పడుతుంది. మరి “సలార్” మూవీ అనుకున్న విధంగా హిట్ అవుతుందా? లేదంటే కలిసి వచ్చేలా చేస్తుందా? అనేది మరో వారం వేచి చూడక తప్పదు. ఏదేమైనా కళ్యాణ్ రామ్ ఇండియా ఎంట్రీ ఇవ్వబోతున్న టైంలో ఈ రిలీజ్ డేట్ తో బిగ్ రిస్క్ చేస్తున్నాడు అని చెప్పాలి.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు