Chiranjeevi : డాన్ పాత్ర‌లో

మెగాస్టార్ చిరంజీవి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. రీ ఎంట్రీ ఇచ్చిన త‌రువాత వ‌రుస సినిమాల‌తో దూసుకెళ్తున్నారు. ఖైదీ 150, సైరా న‌ర్సింహారెడ్డి సినిమాల హిట్ త‌రువాత ఆచార్య సినిమా కాస్త నిరాశ ప‌రిచింది. ఇక ఆ సినిమా నిరాశ‌ప‌రిచిన‌ప్ప‌టికీ తాజాగా గాడ్‌ఫాద‌ర్‌తో అక్టోబ‌ర్ 5న ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. భోలా శంక‌ర్‌, వాల్తేరు వీర‌య్య వంటి సినిమాల్లో న‌టిస్తున్నాడు చిరు.

ఇదిలా ఉండ‌గా.. ఈ రెండు సినిమాలు ఇంకా షూటింగ్ కంప్లీట్ చేసుకోక‌ముందే చిరంజీవి మ‌రో సినిమాను ప‌ట్టాలెక్కించే ప‌నిలో ఉన్న‌ట్టు తెలుస్తోంది. గాడ్ ఫాద‌ర్‌తో మ‌ల‌యాళ సినిమాను రీమెక్ చేసిన మెగాస్టార్ ఈ సారి స్పానిష్ థ్రిల్ల‌ర్‌ను రీమెక్ చేయ‌నున్న‌ట్టు టాక్ వినిపిస్తోంది. చిరు కెరీర్‌లోనే డాన్ పాత్ర‌లో న‌టించ‌నున్న‌ట్టు స‌మాచారం. రిటైర్ అయిన ఓ డాన్ చుట్టూ తిరుగుతుంద‌ని తెలుస్తోంది. ఈ వార్త‌లో వాస్త‌వం ఎంతో అనేది తెలియాలంటే అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే వ‌ర‌కు వేచి చూడాలి.

మ‌రోవైపు ప్ర‌స్తుతం టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో అంద‌రి చూపు గాడ్ ఫాద‌ర్‌పై ఉంది. లూసిఫ‌ర్ రీమెక్‌లో చిరంజీవి, బాలీవుడ్ కండల వీరుడు స‌ల్మాన్ ఖాన్ న‌టిస్తుండ‌డంతో భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. పొలిటిక‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ సినిమాకి మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇందులో న‌య‌న‌తార చిరంజీవికి సిస్ట‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నుంది. ఈ సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే అక్టోబ‌ర్ 5 వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు