Ketika Sharma : అదుర్స్

కొంత మంది హీరోయిన్లు ఎన్ని సినిమాలు చేసినా స‌రైన గుర్తింపు ఉండ‌దు. కానీ కొంత మందికి మాత్రం ఫ‌స్ట్ సినిమాతోనే కేక పుట్టిస్తుంటారు. అలాంటి హీరోయిన్‌ల‌లో కేతిక శ‌ర్మ ఒక‌రు. తాజాగా ఈమె రంగ‌రంగ వైభ‌వంగా మూవీతో టాలీవుడ్‌ని ప‌లుక‌రించింది. ఈ చిత్రం అట్ట‌ర్ ఫ్లాప్ లో అవ్వ‌డం ఈ భామ ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లింది.

ఉప్పెన సినిమాతో సూప‌ర్ హిట్ అందుకున్నాడు మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్‌. ఆ త‌రువాత కొండ పొలం చిత్రం వ‌చ్చిన‌ప్ప‌టికీ అది ఆశించిన మేర ఆక‌ట్టుకోలేదు. ఆ త‌రువాత వ‌చ్చిన రంగ‌రంగ వైభ‌వంగా చిత్రం ఓటీటీ అప్ డేట్ వ‌చ్చింది. ఈ సినిమా అక్టోబ‌ర్ 02, 2022న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ రానుంది. ఈ చిత్రం థియేట‌ర్ల‌లో మిస్ అయిన వారు నెట్‌ఫ్లిక్స్‌లో ఎంజాయ్ చేయ‌వ‌చ్చు. శ్రీ‌వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర బ్యాన‌ర్‌తో తెర‌కెక్కిన ఈ చిత్రంలో న‌వీన్ చంద్ర‌, సుబ్బురాజు, న‌రేష్, ప్ర‌భు త‌దిత‌రులు న‌టించారు.

ఈ సినిమాకి దేవీ ప్ర‌సాద్ సంగీతం స‌మ‌కూర్చారు. తొలుత ఈ సినిమాను జులై 01న విడుద‌ల చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ప‌లు కార‌ణాల వ‌ల్ల ఈ చిత్రం వాయిదా ప‌డింది. యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా వ‌చ్చిన ఈ సినిమాకి గిరీశ‌య్య ద‌ర్శ‌కుడు. మ‌రోవైపు వైష్ణ‌వ్ తేజ్‌, కేతిక శ‌ర్మ జంట‌గా న‌టించిన చిత్ర రంగ‌రంగ వైభ‌వంగా చిత్రం ఆశించిన ఫ‌లితం ద‌క్క‌లేదు. రంగ‌రంగ వైభ‌వంగా ఫ్లాప్ త‌రువాత త‌న త‌రువాత ప్రాజెక్ట్ ల విష‌యంలో ఆచితూచి వ్య‌హ‌రించాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. ప్ర‌స్తుతం ఈమెకు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి. ఇంకెందుకు ఆల‌స్యం మీరు కూడా ఓ లుక్ వేయండి.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు