Pawan Kalyan: బ్రో సినిమాకు అప్పుడే కష్టాలు… మరో భీమ్లా నాయక్, వకీల్ సాబ్ అవుతుందా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతి నిండా సినిమాలున్న ఈ స్టార్ హీరో ప్రస్తుతం రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. వారాహి విజయ యాత్ర పేరుతో పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ లో బస్ యాత్ర చేస్తున్నారు. అయినా, తాను చేసే సినిమాలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా, తాను ఎక్కడ ఉంటే అక్కడే షూటింగ్ చేస్తున్నాడు. అందుకు నిర్మాతలు, డైరెక్టర్లు కూడా సహకరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఉన్న చోటే సెట్ వేసి, షూటింగ్ ను చేస్తున్నారు. కాగా, పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాల్లో బ్రో ఒకటి.

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, పవన్ కళ్యాణ్ కలిసి ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ పై ఫేమస్ స్టూడియోలో పలు కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. ఇటు టాకీ పార్ట్ ను కూడా వేగంగా జరుగుతుంది. వీలైనంత త్వరగా సినిమాను రిలీజ్ చేసే ప్లాన్ లో చిత్ర యూనిట్ ఉంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ పనులను కూడా ప్రారంభించబోతున్నారు. ఈ నెల చివరలో చిత్రం నుంచి టీజర్ రాబోతుందని టాక్. అంతే కాకుండా, జులై మొదటి వారంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా నిర్వహించడానికి నిర్మాతలు సన్నాహాకాలు చేస్తున్నారు.

అయితే అసలు సమస్య ఇక్కడే ఉందే. ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తే, దానికి పవన్ కళ్యాణ్ తప్పక రావాల్సి ఉంటుంది. పవన్ హాజరు కావాలంటే, వారాహి యాత్ర జరుగుతున్న చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఈవెంట్ జరగాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తే అందుకే అనువైన ప్లేస్ రాజమండ్రి. రాజమండ్రిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించడానికి నిర్మాతలు కూడా సిద్ధంగా ఉన్నారు. అయితే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుంచి అనుమతలు రూపంలో ఇబ్బందులు రావొచ్చు అనేది ఇప్పుడున్న సందేహం. ప్రస్తుతం పవన్ కళ్యాణ్.. ఆధికార పార్టీని టార్గెట్ చేస్తూ స్పీచ్ లు ఇస్తున్నారు. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ సినిమాకు అనుమతులు ఇస్తారా? ఇచ్చినా, ఎలాంటి మెలికలు పెడుతారో అనే అనుమానాలు ఉన్నాయి.

- Advertisement -

గతంలో పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్, వకీల్ సాబ్ సినిమాలకు ఎలాంటి ఇబ్బందులు వచ్చాయో అందిరికీ తెలిసిందే. ఇప్పుడు బ్రో సినిమాకు కూడా అలాంటి ఇబ్బందులు పునారావృతం అవుతాయని అంటున్నారు విశ్లేషకులు. దీంతో బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రిలో కంటే హైదరాబాద్ లో నిర్వహించడం మంచింది అనే సలహా కూడా వస్తుందట. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఉంటే, పవన్ కళ్యాణ్ రావడం దాదాపు కష్టమే. ఇలా బ్రో సినిమాకు ఇప్పటి నుంచే కష్టాలు వస్తున్నాయి. మరి బ్రో సినిమా ఈ కష్టాలను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి మరి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment New

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు