Nag ashwin:ప్రాజెక్ట్ కే లో విలన్‌కి ఫస్ట్ ఆప్షన్ రజినీకాంత్… కానీ, ప్రభాస్ రిజక్ట్ చేశాడట?

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ప్రాజెక్ట్ కే చిత్రం రోజు రోజుకు అంచనాలు భారీగా పెరగుతున్నాయి. చిత్రం నుంచి ఎలాంటి అప్డేట్స్ లేని సమయంలోనే నాగ్ అశ్విన్ చాలా పెద్దఎత్తున ప్లాన్ చేస్తున్నాడు అంటూ బజ్ క్రియేట్ అయింది. తాజాగా ఈ సినిమా నుంచి అప్డేట్స్ వస్తున్నాయి. ఇటీవల సినిమా ప్రపంచానికే దిమ్మతిరిగిపోయేలా ఓ అప్డేట్ వచ్చింది ప్రాజెక్ట్ కే నుంచి. అదేంటంటే, ప్రాజెక్ట్ కే లో లోకనాయకుడు కమల్ హాసన్ నటిస్తున్నాడు.

దీన్ని ప్రాజెక్ట్ కేని నిర్మిస్తున్న వైజయంతి మూవీస్ వాళ్లు ఒక వీడియో విడుదల చేసి అధికారికంగా ప్రకటించారు. దీని తర్వాత ఈ సినిమాలో కమల్ హాసన్ విలన్ పాత్ర చేస్తున్నాడంటూ వార్తలు వస్తున్నాి. ఈ ప్రకటన వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ కేపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఇప్పటికే ప్రభాస్, దీపికా పదుకునే, దిశా పటాని తో పాటు బిగ్ బి అమితాబ్ బచ్చన్ లాంటి బిగ్గెస్ట్ స్టార్లు ఉన్నారు. వీరికి తోడుగా లోకనాయకుడు కమల్ హాసన్ రావడంతో సినిమా హై రేంజ్ లో ఉంటుందని అందరూ అనుకుంటున్నారు.

అయితే ప్రాజెక్ట్ కే విలన్ పాత్రకు ఫస్ట్ ఆప్షన్ కమల్ హాసన్ కాదట. ముందుగా సౌత్ ఇండియా సూపర్ స్టార్, రజినీకాంత్ తో విలన్ పాత్ర చేయించాలని డైరెక్టర్ నాగ్ అశ్విన్ అనుకున్నారట. కానీ, దీన్ని ప్రభాస్ రిజక్ట్ చేశారట. ఎందుకంటే, ప్రభాస్ తన చిన్నప్పటి నుంచి రజినీకాంత్ సినిమాలను చూస్తూ పెరిగారట. అంతే కాదు. రజినికి ప్రభాస్ చాలా పెద్ద ఫ్యాన్ కూడా. అలాంటి స్టార్ హీరోను విలన్ గా పెట్టడం ప్రభాస్ కి నచ్చలేదట. దీంతో నాగ్ అశ్విన్ రజినీకాంత్ ఆలోచనను పక్కనపెట్టాడని సమాచారం.

- Advertisement -

రజినీకాంత్ తర్వాత సౌత్ ఇండియాలో ఎక్కువ క్రేజ్ ఉన్న నటుడు కమల్ హాసన్. అందుకే తర్వాత కమల్ హాసన్ వరకు ఈ పాత్ర వెళ్లిందట. అయితే కమల్ హాసన్ కూడా మొదట ఈ సినిమాను రిజక్ట్ చేశారట. కానీ, నాగ్ అశ్విన్ స్టైల్, కథ చెప్పే విధానం నచ్చడంతో ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. కాగా, ప్రాజెక్ట్ కే దాదాపు 70 నుంచి 80 శాతం షూటింగ్ పూర్తి అయిందని టాక్. కమల్ హాసన్ పార్ట్ తో పాటు కొన్ని మైనర్ షూటింగ్ వర్క్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని తెలుస్తుంది. వీలైనంత త్వరగా షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసి, సీజీ వర్క్ పై ఫోకస్ చేయాలని డైరెక్టర్ నాగ్ అశ్విన్ ప్లాన్ చేస్తున్నారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు