Boyapati: రౌడీ హీరో పై కన్ను వేసిన బోయపాటి..!

Boyapati

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి టైర్ -2 హీరోలలో టాప్ పొజిషన్ లో ఉన్నారు హీరో విజయ్ దేవరకొండ.. మొదట పలు సినిమాలలో సైడ్ క్యారెక్టర్లలో కూడా నటించి మంచి విజయాన్ని అందుకున్న విజయ్ దేవరకొండ.. పెళ్లిచూపులు సినిమాతో హీరోగా మారి అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ కి స్టార్ హీరోగా పేరు సంపాదించారు.. గీతగోవిందం సినిమాతో లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అందుకున్నారు. ఇలా ఎన్నో విభిన్నమైన చిత్రాలలో నటించి మంచి విజయాన్ని అందుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ అనే చిత్రంలో నటిస్తున్నారు.

టాలీవుడ్ లో యాక్షన్ చిత్రాలకు పెట్టింది పేరు డైరెక్టర్ బోయపాటి శ్రీను.. చివరిగా హీరో రామ్ తో కలిసి స్కంధ సినిమాని తెరకెక్కించి ఘోరమైన ట్రోల్స్ ఎదుర్కొన్నారు. ఈ సినిమా కాస్త ఓవరాక్షన్ గా ఉందంటూ కూడా రామ్ అభిమానులు బోయపాటి పై ఘాటుగానే స్పందించారు. ఇక తన తదుపరి చిత్రాన్ని బోయపాటి శ్రీను తో నిర్మించడానికి నిర్మాతలు రెడీగా ఉన్నప్పటికీ.. హీరోలు మాత్రం కాస్త వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. బోయపాటి శ్రీను కు కలిసి వచ్చిన బాలయ్య తో అఖండ-2 చేయబోతున్నారనే వార్తలు అయితే వినిపించాయి.. కానీ ప్రస్తుతం పొలిటికల్ పరంగా బాలయ్య బిజీగా ఉండడం చేత ఆగిపోయినట్టు సమాచారం.

గీత ఆర్ట్స్ బ్యానర్ లో తన తదుపరి చిత్రాన్ని చేయబోతున్నట్లు తెలుస్తోంది.. అయితే అల్లు అర్జున్ తో సినిమా చేయాలనుకున్నప్పటికీ.. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప-2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు .. ఈ సినిమా అయిపోయిన వెంటనే వరుసగా మరో మూడు సినిమాలను లైన్ లో పెట్టారు. తమిళ హీరో సూర్య తో.. గీత సంస్థ బ్యానర్ పైన సినిమా తెరకెక్కించాలని అనుకున్నప్పటికీ సూర్య దగ్గర డేట్లు ఖాళీగా లేకవడంతో ఈ హీరో కూడా నో చెప్పారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ను అల్లు అరవింద్ ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

బోయపాటి శ్రీను మాస్ ఓరియెంటెడ్ సినిమాలు తీస్తారనే ప్రచారం ఉండడంతో విజయ్ దేవరకొండ కూడా పెద్దగా బోయపాటితో సినిమా చేయడానికి ఆసక్తి చూపించడం లేదని విజయ్ దేవరకొండ సన్నిహితుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి.. అల్లు అరవింద్ అడగడంతో ఇప్పుడు కథ వినడానికి మాత్రమే సిద్ధమైనట్లు సమాచారం.. ఒకవేళ కథ విన్నాక కథ నచ్చితే సినిమా ఉండవచ్చు కానీ.. అది కథ మీద ఆధారపడుతుందనే. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు