Nagarjuna: వారికి నాగార్జున అన్యాయం చేస్తున్నారా..?

Nagarjuna

టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని నాగేశ్వరరావు ఒకప్పుడు అన్ని జోనర్లలో సినిమాలను చేస్తూ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు.. ఎన్టీఆర్ తర్వాత ఇండస్ట్రీలో ఆ రేంజ్ లో గొప్ప నటుడుగా పేరు సంపాదించారు నాగేశ్వరరావు.. ఆయన తర్వాత ఇండస్ట్రీలో తన నటన వారసత్వాన్ని కొనసాగించాలని అక్కినేని నాగార్జునను ఇండస్ట్రీలోకి హీరోగా పరిచయం చేసి.. నాగార్జున సక్సెస్ కి నాగేశ్వరరావు చాలా కీలకంగా మారారు. అలా తన కుమారుడు నాగార్జునకు వరుస కాంబినేషన్ లను సెట్ చేసి స్టార్ హీరోగా పేరు సంపాదించేలా చేశారు నాగేశ్వరరావు గారు.

అయితే నాగార్జున విషయంలో నాగేశ్వరరావు తీసుకున్న చొరవ ప్రస్తుతం నాగార్జున తన కుమారులు అయిన అఖిల్, నాగచైతన్య విషయంలో మాత్రం తీసుకోలేదంటూ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అప్పట్లో నాగేశ్వరరావు నాగార్జున దగ్గరకు వచ్చిన స్క్రిప్టులను.. దగ్గరుండి మరీ పరిశీలించితనకు నచ్చిన స్క్రిప్టులు రైటర్లతో రాయించి అలాంటి కథలతోనే నాగార్జున చేత సినిమాలు చేయించారు అక్కినేని నాగేశ్వరరావు.. అయితే ఇప్పుడు నాగార్జున మాత్రం వారి కొడుకుల విషయంలో ఎలాంటి జాగ్రత్త తీసుకోకపోవడం పలు అనుమానాలకు దారితీస్తోంది.

అందువల్లే నాగచైతన్య , అఖిల్ నటిస్తున్న సినిమాలు కూడా ఫ్లాప్ లుగా మారి.. స్టార్ హీరోలుగా ఎదగలేక పోతున్నారు.. ఇక చిరంజీవిని తీసుకుంటే రామ్ చరణ్ సక్సెస్ లో చాలా కీలకమైన పాత్రను వ్యవహరించారని చెప్పవచ్చు. ఎలాంటి సినిమాలు చేస్తే ఆడుతాయి.. ప్రస్తుతం ఉన్న సిచువేషన్ లో ప్రేక్షకులు ఎలాంటి సినిమాలను ఆదరిస్తారు అని.. క్యాలుకుకేషన్స్ వేసి మరీ చిరంజీవి రామ్ చరణ్ ను గ్లోబల్ స్టార్ గా ఎదిగేలా చేశారు. కానీ ఇలాంటి విషయంలో నాగార్జున దారుణంగా ఫెయిల్ అయ్యారని చెప్పవచ్చు.

- Advertisement -

దీన్నిబట్టి చూస్తే అక్కినేని ఫ్యామిలీ నుంచి మరో స్టార్ హీరో వచ్చే అవకాశాలు లేవని.. అఖిల్, నాగచైతన్య ఇద్దరూ కూడా తండ్రి ప్రోత్సాహం లేకపోయినా తమ టాలెంట్ తో భారీ సక్సెస్ లు అందుకొని ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీని నిలబెడతారా? లేదా? అనే విషయం పై అభిమానులు సందిగ్ధతతో ఉన్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోలే అక్కినేని కుటుంబాన్ని ఇండస్ట్రీ లో నిలబెట్టి ముందుకు తీసుకువెళ్తారని అభిమానులు ఆశిస్తున్నారు. నాగచైతన్య ప్రస్తుతం తండేల్ సినిమాలో నటిస్తున్నారు. చివరిగా అఖిల్ ఏజెంట్ సినిమాతో ఘోరమైన డిజాస్టర్ ని మూట కట్టుకున్నారు.. ఇప్పుడు తన తదుపరి చిత్రాన్ని ఇంకా ప్రకటించలేదు. నాగార్జున ఇటీవలే నా సామి రంగ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. మొత్తానికైతే కొడుకుల విషయంలో నాగార్జున అన్యాయం చేశారని వార్తలు మాత్రం వినిపిస్తున్నాయి.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు