Balakrishna: అతడికి అవార్డు రాలేదని బాధపడుతున్న బాలకృష్ణ.. ఎవరంటే..?

Balakrishna

నందమూరి కుటుంబం నుంచి హీరోగా బాలకృష్ణ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. ఇప్పటికీ తన హవా కొనసాగిస్తున్నారు. ఇకపోతే అప్పుడప్పుడు బాలయ్య అభిమానుల పైన చేయి చేసుకున్న సందర్భాలు ఉన్నాయి కానీ బాలకృష్ణను దగ్గర నుంచి చూసినవారు మాత్రం బాలయ్యది చిన్నపిల్లల మనస్తత్వం అని చెబుతూ ఉంటారు. మరి కొంతమంది ఎన్నో రకాలుగా ట్రోల్స్ చేస్తూనే ఉంటారు. బాలకృష్ణ సినిమాలలో ఎక్కువగా నటుడు జయప్రకాష్ రెడ్డి విలన్ గానే నటించారు. జయ ప్రకాష్ రెడ్డి కాంబినేషన్ లో విలనిజం కూడా ఎన్నో చిత్రాలకి బాగా కలిసి వచ్చింది.

బాలకృష్ణ హీరోగా వచ్చిన సమరసింహారెడ్డి సినిమాలో జయప్రకాష్ రెడ్డి యాక్టింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. అయితే ఈ సినిమాలో ఆయన విలనిజానికి అవార్డు రాకపోవడం బాలయ్యను చాలా బాధపెట్టిందట. ఈ విషయాన్ని ఒకానొక సందర్భంలో మీడియా ముందు కూడా బాలయ్య ప్రస్తావించారు. జయప్రకాష్ రెడ్డి నటన అంటే తనకు చాలా గౌరవం అని ఎన్నో సందర్భాలలో బాలయ్య చెప్పుకొచ్చారు. జయప్రకాష్ రెడ్డి వంటి వారితో పనిచేయడం కూడా చాలా అదృష్టంగా భావిస్తానని బాలయ్య తెలిపారు. అంతేకాదు ఈయన ఎంతోమంది నటులను చాలా ఆప్యాయంగానే పలకరించే వారని కూడా తెలిపారు బాలయ్య.

బాలయ్య నటించిన సమరసింహారెడ్డి సినిమా మార్చి 2వ తేదీన రీ రిలీజ్ కు సిద్ధమయ్యింది. ఈ తరుణంలోనే బాలయ్య చేసిన వ్యాఖ్యలను సైతం మరొకసారి సోషల్ మీడియాలో అభిమానులు వైరల్ గా చేస్తున్నారు. ప్రస్తుతం బాలయ్య సినిమాల విషయానికి వస్తే. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఏడాది ఈ సినిమాని విడుదల చేసే విధంగా డైరెక్టర్ బాబీ ప్లాన్ చేస్తున్నారు.

- Advertisement -

ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ నటుడు బాబి డియోల్ ని నటిస్తూ ఉండడంతో ఈ సినిమా పై అంచనాలు మరింత పెరిగాయి. అలాగే బాలయ్య, బోయపాటి కాంబో సినిమా పైన అఖండ-2 వస్తుందని రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి.. కానీ ఇప్పటివరకు ఈ విషయం పై అధికారికంగా చిత్ర బృందం ప్రకటించలేదు. ఏది ఏమైనా బాలయ్య.. జయప్రకాష్ రెడ్డి వంటి నటుడికి అవార్డు ఇవ్వకపోవడం బాధాకరమంటూ తెలిపారు.

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు