Devara: టైటిల్ తనదే అంటున్న బండ్ల – కాంప్రమైజ్ అవుతాడా..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న దేవర సినిమాకు సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ విడుదలైన సంగతి తెలిసిందే. టైటిల్ అనౌన్స్ కాకముందే ఈ సినిమా టైటిల్ దేవర అంటూ ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో దేవర టైటిల్ తనదే అంటూ ట్వీట్ చేసాడు నిర్మాత బండ్ల గణేష్. నిజానికి గతంలో దేవర టైటిల్ ని రిజిస్టర్ చేయించినట్లు తెలిపాడు బండ్ల గణేష్. అయితే, ఆ టైటిల్ ని బండ్ల గణేష్ రెన్యూవల్ చేయించకపోవటంతో ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా కోసం దేవర టైటిల్ ని వాడుకున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ కోసం రిజిస్టర్ చేయించిన టైటిల్ కాస్తా ఎన్టీఆర్ సినిమాకి ఫిక్స్ అయ్యింది.
ఫస్ట్ లుక్ రిలీజ్ కొన్ని గంటల ముందు బండ్ల గణేష్ ఈ ట్వీట్ చేయటంతో సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలో బండ్ల గణేష్ దేవర నిర్మాతలతో కాంప్రమైజ్ అవుతారా లేక తన టైటిల్ కోసం ఛాంబర్ లో పంచాయితీ పెడతారా అన్న చర్చ జరుగుతోంది. భీమ్లా నాయక్ సినిమాలో ‘కొక్కిలి దేవర’ ప్రస్తావన రావటంతో దేవర టైటిల్ పవన్ కళ్యాణ్ కే అని ఫిక్స్ అయ్యారు పవన్ అభిమానులు. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాకి ఆ టైటిల్ ఫిక్స్ అవ్వటంతో ఒకింత నిరాశలో ఉన్నారు పవన్ అభిమానులు.
ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. RRR తర్వాత ఎన్టీఆర్ నుండి వస్తున్న సినిమా కావటంతో ఈ సినిమాపై పాన్ ఇండియా వైడ్ ఆసక్తి నెలకొంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ ఫై నిర్మితమవుతున్న ఈ సినిమాను 2024 ఏప్రిల్ లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం దేవర సినిమాతో పాటుగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు ఎన్టీఆర్. వీటితో పాటుగా హ్రితిక్ రోషన్ తో కలిసి వార్ 2సినిమాలో కూడా ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్లో నటించనున్నాడు.ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత వస్తున్న ఈ సినిమా హిట్ అవ్వటం కొరటాలకి చాలా కీలకం అని చెప్పాలి. మరి, టైటిల్ విషయంలో బండ్ల గణేష్ కాంప్రమైజ్ అవుతాడా లేదా చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు