Megastar: చిరు సినిమాలో మరో కుర్ర హీరో…?

మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తమిళ సినిమా వేదాళం కి రీమేక్ గా భోళా శంకర్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత చిరంజీవి నటిస్తున్న సినిమా కాబట్టి రీమేక్ అయినప్పటికీ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఆగస్టు 11న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. అయితే ఈ సినిమా విడుదల వాయిదా పడే అవకాశం ఉందని ఇటీవల వార్తలొచ్చాయి. అయితే ఆ వార్తల్లో నిజం లేదని సినిమా యూనిట్ క్లారిటీ ఇచ్చింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం భోళా శంకర్ సినిమాలో శ్రీకాంత్ తనయుడు రోషన్ ఒక చిన్న పాత్రలో మెరవనున్నాడట.
ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుకుంటున్న ఈ సినిమాలో చిరంజీవి పాత సినిమాల్లోని పాటలు కూడా రీమిక్స్ చేస్తున్నారని సమాచారం. వింటేజ్ చిరుని గుర్తు చేసేలాగా మెహర్ రమేష్ ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు. అయితే భోళా శంకర్ సినిమాలో రోషన్ నటిస్తున్నాడు అన్న అంశంపై అధికారిక ప్రకటన లేనప్పటికీ, ఇది ఆల్మోస్ట్ కన్ఫార్మ్ అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
చిరంజీవి అన్నయ్య అని పిలిచే శ్రీకాంత్ శంకర్ దాదా ఎంబీబీఎస్, జిందాబాద్ సినిమాల్లో చిరు పక్కన ఫుల్ లెంత్ రోల్ చేసే అవకాశం అందుకున్నాడు. ఇప్పుడు శ్రీకాంత్ తనయుడు కూడా చిరు సినిమాలో నటిస్తున్నాడు అన్న వార్త గనక నిజమే అయితే, తండ్రి కొడుకులు ఇద్దరు లక్కీ అనే చెప్పాలి. రీమేక్ కావటంతో మెగా అభిమానులు సైతం అంతగా అంచనాలు పెట్టుకొని ఈ సినిమా ఏ మేరకు అలరిస్తుందో వేచి చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు