Venu: ఆ హీరోల వైపు ‘బలగం’ వేణు చూపు – పెద్ద ప్లానింగే..!

కమెడియన్ వేణు దర్శకత్వంలో ఇటీవల విడుదలైన బలగం సినిమా సృష్టించిన సంచలనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై 3కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొంది, సుమారు 8కోట్ల మేర కలెక్షన్స్ రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అప్పటిదాకా కమెడియన్ గా మాత్రమే తెలిసిన వేణు, ఈ సినిమా ద్వారా తనలోని దర్శకుడ్ని పరిచయం చేశాడు. తెలుగులో బలగం లాంటి మానవ సంబంధాల మీద రూపొందిన సినిమా వచ్చి చాలా కాలం అవ్వటంతో ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరధం పట్టారు. ప్రశంసలతో పాటు పలు అంతర్జాతీయ అవార్డులను కూడా అందుకుంది బలగం సినిమా. ఈ సినిమా తర్వాత వేణు నుండి ఎలాంటి సినిమా రాబోతోంది అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
ఈ క్రమంలో తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వేణు తన తర్వాతి సినిమా కోసం సీనియర్ హీరోలు రాజశేఖర్, వెంకటేష్ వంటి వారి పేర్లను పరిశీలిస్తున్నాడని సమాచారం. ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ ఈ సినిమాను కూడా దిల్ రాజు నిర్మించబోతున్నాడని సమాచారం అందుతోంది. ఇదే గనక నిజం అయితే, ఒక్క సినిమాతోనే కమెడియన్ వేణు కాస్తా స్టార్ డైరెక్టర్ రేంజ్ కి ఎదిగినట్లే అని చెప్పాలి.
ముఖ్యంగా పల్లెల్లో బలగం సినిమా క్రియేట్ చేసిన యుఫోరియా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. దీంతో స్టార్ హీరోలు, బడా నిర్మాతల చూపు వేణుపై పడింది. స్టార్ హీరోలు సైతం తమ బిజీ షెడ్యూల్ ని అడ్జస్ట్ చేసుకొని మరీ వేణుకి డేట్స్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం అందుతోంది. అయితే పెద్ద హీరోలను డైరెక్ట్ చేయాలన్న మోజులో వేణు కూడా మూస పద్దతిలో రొటీన్ కమర్షియల్ కథల జోలికి వెళ్లకుండా బలగం లాంటి ఎమోషనల్ కంటెంట్ ఉన్న కథలు మాత్రమే చేసి తన ప్రత్యేకత చాటుకుంటాడని ఆశిద్దాం.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు