Balagam: బాడీ షేమింగ్ కథనాలపై క్లారిటీ ఇచ్చిన కావ్య..!

బలగం సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ అందుకొని అందరి దృష్టిని ఆకర్షించింది కావ్య కళ్యాణ్ రామ్. గంగోత్రి సినిమా ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ పిల్లి కళ్ల పాప మసూద సినిమా ద్వారా హీరోయిన్ గా తన జర్నీ స్టార్ట్ చేసింది. బలగం సినిమా ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన కావ్య హీరోయిన్ గా ట్రై చేస్తున్న రోజుల్లో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి చెప్పిందంటూ వచ్చిన కథనాలపై క్లారిటీ ఇచ్చింది కావ్య కళ్యాణ్ రామ్ తనకు అలాంటి అనుభవాలు ఎదురవ్వలేదని, ఆ కథనాల్లో వచ్చినట్లుగా ఏ డైరెక్టర్ తనని బాడీ షేమింగ్ చేయలేదని స్పష్టం చేసింది.

తాను చేయని, తనకు సంబంధం లేని వ్యాఖ్యలతో పలు మీడియా హౌస్ లు కథనాలు ప్రచురించాయని, వాటిల్లో వాస్తవం లేదని, ఏ డైరెక్టర్ నుండి తనకు బాడీ షేమింగ్ సమస్య ఎదురు కాలేదని స్పష్టం చేసిన కావ్య ఇక మీదట ఇలాంటి అసత్య ప్రచారాలు చేయద్దని ట్వీట్ ద్వారా మీడియా హౌస్ లకు విజ్ఞప్తి చేసింది.

ఈ నేపథ్యంలో కావ్యపై వచ్చిన కథనాలు నెట్టింట వైరల్ అయ్యాయి. బలగంతో బ్లాక్ బస్టర్ అందుకున్నప్పటికీ కావ్యకి ఆశించిన స్థాయిలో ఆఫర్లు రాలేదని చెప్పాలి. అయితే, నటనకు ప్రాధాన్యం ఉన్న క్యారెక్టర్స్ కి మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తున్న కావ్య, మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ లో నటించి మెప్పించి స్టార్ హీరోయిన్ స్టేజ్ కి చేరుతుందా లేదా వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు