Thalapathy: మరో పొలిటికల్ డ్రామాతో రానున్న విజయ్..!

తలపతి విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్లాన్ లో భాగంగా త్వరలోనే పాదయాత్ర కూడా ప్రారంభించనున్నాడని వార్తలొస్తున్నాయి. విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఆల్మోస్ట్ కన్ఫార్మ్ అయ్యిందని, ఈ మేరకు తన అభిమానులతో చర్చలు కూడా జరిపాడని సమాచారం. విజయ్ ప్రస్తుతం నటిస్తున్న లేవు సినిమా రిలీజ్ కి ముందే తన పొలిటికల్ ఎంట్రీపై అనౌన్సమెంట్ ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉండగా విజయ్ తన నెక్స్ట్ సినిమా శంకర్ డైరెక్షన్లో చేయనున్నాడని, ఆ సినిమా పొలిటికల్ బ్యాక్డ్రాప్ లో ఉండనుందని టాక్ వినిపిస్తోంది.

విజయ్ ప్రస్తుతం లియో సినిమాలో నటిస్తున్నాడు, లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వస్తున్న మూడో సినిమా కావటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అక్టోబర్ 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతుండగా, దర్శకుడు శంకర్ కమల్ హాసన్ తో ఇండియన్2, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ ప్రాజెక్ట్స్ పూర్తయ్యాక శంకర్ విజయ్ కాంబినేషన్లో రాబోయే సినిమా స్టార్ట్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట.

విజయ్ పొలిటికల్ ఎంట్రీపై ప్రచారం జరుగుతున్న సమయంలో శంకర్ తో పొలిటికల్ బ్యాక్డ్రాప్ సినిమా రాబోతుందన్న టాక్ రావటంతో సినిమాపై అటు అభిమానుల్లో, ఇటు నార్మల్ ఆడియెన్స్ లో ఆసక్తి పెరిగింది. మరి, తమిళనాట ప్రస్తుతం పొలిటికల్ గా వ్యాక్యూమ్ ఉన్న తరుణంలో విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఎలా ఉండబోతోంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు