Shankar: రామ్ చరణ్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్ .. గేమ్ చేంజర్ కు బిగ్ బ్రేక్ !

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఇటీవలనే పేరెంట్స్ అయిన సంగతి అందరికి తెలిసిందే. దాదాపు పదేళ్ల దాంపత్య జీవితం తరువాత ఉపాసన పండంటి ఆడపిల్లకి జన్మనివ్వగా. మెగా ఫ్యామిలీకి వారసురాలిగా పుట్టిన ఈ బిడ్డ పట్ల మెగా ఫ్యామిలీ అంత చాలా సంతోషంగా ఉన్నారు. మరో పక్క మెగా ప్రిన్సెస్ రాకతో మెగా అభిమానులు కూడా అనడంతో ఉవ్విళూరుతున్నారు.

అయితే అంత బాగుందనే సమయంలో రామ్ చరణ్ ఫ్యాన్స్ ను బాధ పెట్టె న్యూస్ ఒకటి ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది. ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్ కి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు రావడం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న వరుణ్ తేజ్ కి పెళ్లి కుదరడం, పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితం మెరుగవుతుండటం అన్ని రామ్ చరణ్ కు పుట్టిన బిడ్డ వేళా విశేషం అంటూ చిరంజీవి ఇటీవలనే మీడియాతో ఆయన సంతోషాన్ని పంచుకున్న విషయం తెలిసిందే.

రామ్ చరణ్, శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమా చేస్తుండగా, దాదాపు సంవత్సరంకు పైగా ఈ సినిమా షూటింగ్ జరుగుతూనే ఉంది. ఇటీవలనే సినిమాకి సంబంధించి క్లైమాక్స్ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకోగా. ఇంకా ఒక షెడ్యూల్ షూటింగ్ మాత్రమే బాలన్స్ ఉంది. అయితే ఈ షెడ్యూల్ కంప్లిట్ చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకోగా..ఉపాసన డెలివరీ కారణంగా వీటన్నిటికీ బ్రేక్ పడింది.

- Advertisement -

ప్రస్తుతం ఉపాసన పక్కన రామ్ చరణ్ ఉండటం అనివార్యం కావడంతో గేమ్ చేంజర్ సినిమా తాత్కాలికంగా ఆగిపోయింది. రామ్ చరణ్ పేరెంటల్ లీవ్ తీసుకొని పుట్టిన పాపకి దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఉపాసన పూర్తిగా కోలుకోగానే మళ్ళీ గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయనున్నాడట. దాంతో శంకర్ ఇండియన్2 సినిమాకి సంబందించిన పనుల్లో పడిపోయినట్టు తెల్సుతోంది. దీన్నిబట్టి చూస్తే గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ కి ఇంకా సమయం పట్టేలా ఉందనిపిస్తోంది. ఇది నిజంగా మెగా అభిమానులకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు