Akhil: డిజాస్టర్ సినిమాకి ఓటీటీలో కూడా డిమాండ్ లేదా…?

అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి డైరెక్షన్లో రూపొందిన ఏజెంట్ సినిమా గత నెలలో రిలీజ్ అయ్యి ఎంతటి డిజాస్టర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రెండేళ్లపాటు అఖిల్ సిక్స్ ప్యాక్ మెయింటైన్ చేసి అఖిల్ పడ్డ కష్టం అంతా వృధా అయ్యింది ఈ సినిమా ద్వారా. ఏజెంట్ ఫెయిల్యూర్ కి కారణం సురేందర్ రెడ్డి అంటూ అభిమానులతో సహా సినిమా యూనిట్ కూడా డిసైడ్ చేసింది. ఇదిలా ఉంటే, ఈ సినిమాను మళ్లీ ఎడిటింగ్ టేబుల్ మీదకి తీసుకెళ్తున్నారని కొన్నాళ్ల కిందట టాక్ వినిపిస్తోంది. సినిమాలోని అనవసరమైన సీన్లని తొలగించి, ఇంకొన్ని సీన్స్ ని యాడ్ చేసి జూన్ 23న ఓటీటీలో రిలీజ్ చేయనున్నారని ప్రచారం జరిగింది. అయితే, థియేటర్లలో రిలీజ్ వాయిదా పడ్డట్టే ఓటీటీలో కూడా టాక్ వచ్చిన డేట్ కి రిలీజ్ కాలేదు.

ఈ సినిమాను ఎవరు రీ ఎడిట్ చేస్తున్నారన్న విషయంపై క్లారిటీ లేదు కానీ, సినిమా రిలీజ్ అయ్యి ఇన్నాళ్లు అవుతున్నా కూడా ఓటీటీలో స్ట్రీమ్ అవ్వకపోవటంతో ఇక రిలీజ్ కాదేమో అన్న అనుమానం కలుగుతోంది.డైరెక్టర్ సురేందర్ రెడ్డి మళ్లీ ఈ సినిమాను టచ్ చేసే సాహసం అయితే చేయడని చెప్పాలి. ఎందుకంటే, అందరూ తననే బాద్యుడ్ని చేయటం, రెమ్యునరేషన్ కూడా సగమే తీసుకోవటం వల్ల ఈ ప్రాజెక్ట్ లో మళ్ళీ జాయిన్ అయ్యే సూచనలు లేవు. నిర్మాత అనిల్ సుంకర గతంలో డైరెక్షన్ చేసిన అనుభవం ఉంది కాబట్టి ఆయనేమైనా ఈ టాస్క్ భుజాన వేసుకున్నారా అన్న అనుమానం కలుగుతోంది. లేకపోతే ఈ సినిమా రైట్స్ కొన్న ఓటీటీ సంస్థ సోని లివ్ ఏమైనా సొంత టీమ్ తో ఎడిట్ చేయించే అవకాశం ఉంది.

వాస్తవానికి ఏజెంట్ సినిమా లాంటి డిజాస్టర్స్ చాలానే వచ్చాయి గతంలో, ఆ సినిమాలు కూడా డిజిటల్ ప్లాట్ఫార్మ్స్ పై స్ట్రీమ్ అయ్యాయి. ఏజెంట్ సినిమాకి ఈ పరిస్థితి తలెత్తడం అఖిల్ బ్యాడ్ లక్ అనే చెప్పాలి. నిర్మాత అనిల్ సుంకర భోళాశంకర్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నందున ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ ని లైట్ తీసుకుంటున్నట్లు అనిపిస్తోంది. ఇక డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్న సోనీ లివ్ సంస్థ కూడా ఏజెంట్ ని పట్టించుకోకపోవటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మరి, రీఎడిట్ చేస్తున్నారన్న వార్తలు నిజమై ఓటీటీలో ఆయినా ఏజెంట్ కి మంచి రెస్పాన్స్ వస్తుందేమో వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు