Allu Arjun: మురుగదాస్ ని కూడా రిజెక్ట్ చేశాడు? రేంజ్ పెరిగిందనా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగా బ్యాక్ గ్రౌండ్ నుండే వచ్చినప్పటికీ, కష్టపడి ఎదిగి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు ని సంపాదించుకుని టాప్ హీరోల్లో ఒకడిగా నిలిచాడు. అయితే ఈ హీరో నుండి ఒకటి గమనిస్తే స్టార్ కాక ముందు ఒకలా, స్టార్ అయ్యాక మరోలా ప్రవర్తిస్తుంటాడని ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంది.

అది గాక అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ కొట్టినప్పుడల్లా ఒకరకమైన బిహేవియర్ కూడా కనిపిస్తూ ఉంటుంది. అది హిట్ కొట్టాడన్న గర్వమో, లేక మరేదైనా కారణమో తెలీదు గాని, తాజాగా అల్లు అర్జున్ కి సంబంధించిన ఓ న్యూస్ మాత్రం సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.

స్టార్ డైరెక్టర్ మురుగదాస్ తమిళ్ న్యాచురల్ స్టార్ శివ కార్తికేయన్ హీరోగా ఓ సినిమా చేస్తున్నాడన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఒక ప్రత్యేక అతిథి పాత్రకి అల్లు అర్జున్ ని సంప్రదించారట మురుగదాస్. అయితే అల్లు అర్జున్ నటించానని ఒక్క మాటలో సున్నితంగా తిరస్కరించాడట.

- Advertisement -

దీనిపై రకరాల వాదనలు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ రేంజ్ పెరిగింది కాబట్టి, ఇకపై వేరే హీరోల సినిమాల్లో చేయకూడదని డిసైడ్ అయ్యాడని అంటుంటే, మరో వర్గం షెడ్యూల్ డేట్స్ అడ్జస్ట్మెంట్స్ లేక రిజెక్ట్ చేసాడని అంటున్నారు.

అయితే ఎక్కువ శాతం ఆడియన్స్ ఈ ఇష్యూ పై నెగిటివ్ గానే స్పందిస్తున్నారు. ఈ న్యూస్ గనక నిజమే అయితే మురుగదాస్ సినిమా బన్నీ రిజెక్ట్ చేసి తప్పు చేసాడని, శివ కార్తికేయన్ తో సినిమాలో నటించడం ఇష్టం లేకే రిజెక్ట్ చేసారని రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతో మూవీ మేకర్స్ క్లారిటీ ఇస్తేనే తెలుస్తుంది.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు